Telugu

ఆర్కే పలుకు: టీడీపికి కార్యకర్తలే ప్రతిపక్షం!

సాధారణంగా ప్రతీ పార్టీలో అధిష్టానానికి తాన తందానా పాడేవారే ఉంటారు. కాంగ్రెస్‌ పార్టీలో కూడా ఇదే పద్దతి ఉంది కానీ అప్పుడప్పుడు భిన్నస్వరాలు కూడా వినిపిస్తుంటాయి. ఇదే అంశంపై నేడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో ఆసక్తికర విశ్లేషణ వచ్చింది.

అన్ని పార్టీలలో మాదిరిగానే టీడీపికి కూడా కార్యకర్తలే బలం. కానీ ఆ కార్యకర్తలే టీడీపికి ప్రధాన ప్రతిపక్షంగా కూడా వ్యవహరిస్తుంటారని ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ చుట్టూ చేరిన నేతలు అధికారం కోల్పోగానే మాయం అయిపోయారు. కానీ ఆ సమయంలో కూడా పార్టీ కార్యకర్తలు వారిని అంటిపెట్టుకునే ఉన్నారు.

ADVERTISEMENT

అన్ని పార్టీలలో ఇదే జరుగుతోంది కనుక ఇదేమీ పెద్ద విచిత్రం కాదు. కానీ టీడీపి అధిష్టానం తప్పులు లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు అండగా నిలబడిన ఆ కార్యకర్తలే విమర్శించడానికి వెనకాడరనే వేమూరి రాధాకృష్ణ చెప్పిన మాట వాస్తవం.

రెండోసారి టీడీపి అధికారంలోకి వచ్చాక సిఎం చంద్రబాబు నాయుడు వైసీపీ పట్ల మెతక వైఖరి ప్రదర్శిస్తున్నప్పుడు కార్యకర్తలు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. పార్టీలో నేతల మద్య విభేదాలు తలెత్తినప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు వెంటనే సరిచేయకపోతే అసహనం వ్యక్తం చేస్తుంటారు.

అలాగే అభివృద్ధి పనులు, సంక్షేమ పధకాల అమలు వంటి విషయాలలో కార్యకర్తలు టీడీపి అధిష్టానానికి తమ అభిప్రాయలు, సూచనలు ఏదో విధంగా తెలియజేస్తూనే ఉంటారు.

వైసీపీ విషయంలో చంద్రబాబు నాయుడు మెతకవైఖరిని తప్పు పడుతున్న కార్యకర్తలే మంత్రి నారా లోకేష్‌ (రెడ్ బుక్) వైఖరిని మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే వారు కంటికి కన్ను.. పంటికి పన్ను రియాక్షన్ ఉండాలనుకుంటున్నారు. అలాగని నారా లోకేష్‌ ఏమీ వైసీపీ నేతలేవరినీ వేధించడం లేదు. ఇందుకు కొడాలి నాని ఫ్రీడం చక్కటి ఉదాహరణగా కనిపిస్తోంది కదా?

ఒకవేళ చంద్రబాబు నాయుడు లేదా నారా లోకేష్‌ నోట ‘మావిగన్‌’ వంటి ప్రతిపాదన వస్తే కార్యకర్తలు రియాక్షన్ వేరేలా ఉంటుంది తప్ప వైసీపీ నేతలు, కార్యకర్తల్లా ఎవరూ తాన తందానా పాడరని వేమూరి రాధాకృష్ణ చెప్పిన మాట వాస్తవం.

అధినేతలు ఎవరూ ఆకాశం నుంచి ఊడిపడరు. ఒకవేళ ఊడిపడినా తప్పులు చేయకుండా ఉండరు. కానీ చేస్తున్నప్పుడు పిల్లి మెడలో గంట కట్టేవారు ఉండాలి. టీడీపిలో ఉన్నారు కనుక గాడి తప్పితే మళ్ళీ సరిచేసుకొని ముందుకు సాగుతోంది.

కానీ వైసీపీ, బీఆర్ఎస్‌ పార్టీలలో అధినేతలు తప్పుడు ఆలోచనలు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు విధానాలతో అహంకారపూరితంగా ముందుకు సాగుతుంటే ఎవరూ వారించకపోగా తాన తందానా పాడుతుంటారు.

ఉదాహరణకు జగన్‌ అమరావతిని పాడుబెట్టేసి మూడు రాజధానులు అంటున్నప్పుడో, కేసీఆర్‌ టీఆర్ఎస్‌ పార్టీ పేరుని బీఆర్ఎస్‌ పార్టీగా మార్చుతున్నప్పుడో ఎవరైనా వారించి అడ్డుకొని ఉంటే నేడు వారి పరిస్థితి, ఆ పార్టీల పరిస్థితి వేరేగా ఉండేది కదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

WC Winning Captain’s Career Flop? First India, Now Nowhere

Suryakumar Yadav’s career has taken another unexpected turn. After being left out of all three…

14 minutes ago

ఏపీ అభివృద్ధి వార్తలను అవినీతి కేసులు మింగేస్తున్నాయే!

అభివృద్ధి గురించి ఆలోచించాలంటే అమరావతి, పోలవరంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మౌలిక వసతుల అభివృద్ధి, కొత్తగా ఏర్పాటవుతున్న పరిశ్రమలు,…

25 minutes ago