కేసీఆర్ ను కలిసిన ఏపీ టిడిపి ఎంపీ!

murali mohan, kcr, tdp mp, Telangana Cm, Andhra Pradesh MP, Chandrababu, telugu desam,Search Results Kumbhabhishekham, CM KCRఏపీ, తెలంగాణా రాష్ట్రాల మధ్య అనేక అభిప్రాయ బేధాలు ఉన్న విషయం తెలిసిందే. నీటి విషయంలో, ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో వాదోపవాదాలు చేసుకుంటున్న సంగతి విదితమే. ముఖ్యంగా తెలంగాణా మంత్రి హరీష్ రావు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేస్తూ వ్యాఖ్యానించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇలా హాట్ హాట్ గా రాజకీయాలు రాజ్యమేలుతున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఏపీ ఎంపీ తెలంగాణా ముఖ్యమంత్రిని కలుసుకున్నారు.

ప్రముఖ సినీ నటుడు, రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్ తెలంగాణా సిఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి శనివారం నుండి బుధవారం వరకు జరగబోయే మహాకుంభాభిషేకానికి ఆహ్వానం పలికారు. ఫిలింనగర్లోని దైవ సన్నిధిలో నిర్వహించునున్న ఈ కార్యక్రమానికి తప్పక హాజరు కావాలని ఏపీ ఎంపీ తెలుపగా, ఖచ్చితంగా వచ్చి తీరుతానని కేసీఆర్ హామీ ఇచ్చారు. వీరిద్దరి కలయిక తొలుత పొలిటికల్ వర్గాల్లో సంచలన రేపగా, ఆ తర్వాత విషయం తెలుసుకుని చల్లబడింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories