సినిమాల పబ్లిసిటీ… ఇంత చీప్ గానా..?

TEASER- OKKADU MIGILADU MANOJ MANCHUచేరాల్సిన గమ్యానికి అనేక దారులు ఉంటే… రహదారులు ఎంచుకోవడం కొందరి వంతయితే… అడ్డదారులను వెతుక్కోవడం మరికొందరు అనుసరించే పద్ధతి. అయితే ఈ రెండు కాకుండా… సందుగొందుల్లో సాగించడం మంచు మనోజ్ లాంటి హీరోల పద్ధతి అన్న విషయాన్ని చాటిచెప్పుకున్నాడు. ‘తాను నటన నుండి దూరమవుతున్నాను’ అంటూ బుధవారం నాడు ఉదయం మంచు మనోజ్ చేసిన ఓ ట్వీట్ మీడియా వర్గాల్లో సంచలనం సృష్టించడంతో… దానిని వెంటనే డిలీట్ చేసి, అబ్బే తనకు అలాంటి ఆలోచన ఏం లేదన్న విషయాన్ని స్పష్టం చేసాడు.

మరి ఇంత హంగామా ఎందుకు చేసావయ్యా మంచు బాబు… అంటే సినిమా పబ్లిసిటీ కోసం అన్న సమాధానం లభించింది. తమ సినిమాలకు పబ్లిసిటీ చేసుకోవడం కోసం ఇంత చీప్ ట్రిక్స్ ను వినియోగించడాన్ని ప్రస్తావిస్తూ… మంచు మనోజ్ పై విమర్శల వర్షం కురుస్తోంది. నిజానికి ఆ ట్వీట్ వేసినపుడే సినీ పండితులు ఈ నిర్ణయం మారవచ్చన్న భావనను వ్యక్తపరచగా, చివరికి అదే జరగడం విశేషం. ఇవే తన చివరి సినిమాలంటూ స్పష్టంగా చెప్పిన మంచు, చివరికి తన భావనను తప్పుగా అర్ధం చేసుకున్నారని మీడియాపైకి నేట్టేసాడు.

ADVERTISEMENT

అయితే ఒకరో, ఇద్దరో అయితే తప్పుగా అర్ధం చేసుకుంటారు గానీ… తను చేసిన ట్వీట్ నూటికి నూరు శాతం మంది ఒకే విధంగా తప్పుగా ఎలా అర్ధం చేసుకుంటారో కూడా వివరణ ఇవ్వాల్సి ఉంది. తప్పు తన వైపు ఉంచుకుని కూడా… దానిని మీడియాపైకి రుద్దేయడం అనేది అపరిపక్వ తెలివితేటలకు నిదర్శనమని చెప్పాలా? సహజంగా మనోజ్ తన ఫ్రెండ్స్ ను ఎప్పుడూ ఫూల్స్ ని చేస్తూ ఉంటాడు అనేది ట్రేడ్ వర్గాల్లో రెగ్యులర్ గా వినిపించే మాట. అయితే ఈ సారి తనను అభిమానించే ఫ్యాన్స్ ను కూడా ఫూల్స్ చేసాడు అనేది లేటెస్ట్ టాక్.

ADVERTISEMENT
Latest Stories