తేజు… మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి..? ఎలా..!?

Tejaswi Madivada in Balak-Palak remakeఈ ఆదివారం నాటి ఎపిసోడ్ లో హాట్ బ్యూటీ తేజస్వి ”బిగ్ బాస్” హౌస్ నుండి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు బయటకు వచ్చిన వారెవరూ మళ్ళీ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేయలేదు, నిజానికి అలాంటి అవకాశం ఉంటుందని కూడా ఎవరికీ తెలియదు. కేవలం వైల్డ్ కార్డు ఎంట్రీలు మాత్రమే ఉంటాయని భావించిన ప్రేక్షకులకు షాక్ ఇస్తూ, తేజు మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే అవకాశాలను చూసుకుంటోంది.

దీనికి సంబంధించిన సోషల్ మీడియాలోకి వచ్చి లైవ్ ఇవ్వబోతోంది. ‘తాను మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలంటే, ఈ రాత్రి నుండి ఓటింగ్ ప్రారంభం కానుందని’ చెప్పిన తేజు, ఇప్పటివరకు మీరు హౌస్ లో చూసింది ఒకటైతే, అక్కడ జరిగింది మరొకటి అని చెప్పింది. అసలేం జరిగిందన్న దానిపై లైవ్ వీడియోకు వచ్చి వివరిస్తానని, మీరంతా ఓట్లు వస్తే మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి తనను తాను నిరూపించుకుంటానని తెలిపింది తేజు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories