సామ్రాట్ ‘సీక్రెట్’ బయటపెట్టిన తేజస్వి!

Tejaswi Madivada responds on samrat controversyబుల్లితెరపై సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోన్న ‘బిగ్ బాస్-2’ షో నుండి ఎలిమినేట్ అయిన తేజస్వి, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సామ్రాట్ పై స్పందించింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంత కాలం సామ్రాట్ తో చాలా క్లోజ్ గా ఉన్న వైనం… తేజస్వి ఎలిమినేట్ అయినప్పుడు ఎంతో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టిన సామ్రాట్… తదితర సంఘటనలతో, వీరిద్దరి మధ్య “కుచ్ కుచ్ హోతా హై” అంటూ సోషల్ మీడియా కోడై కూసింది.

[m9ad]

ADVERTISEMENT

ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా ప్రచారం జరిగింది. దీనిపై తాజాగా స్పందిస్తూ… ‘నిజానికి ఎనిమిదేళ్ల క్రితమే సామ్రాట్ నాకు పరిచయం. అప్పట్లో అంత క్లోజ్ గా ఉండేవాళ్లం కాదు. అతనికి పెళ్లయిందని, ఏదో సమస్య ఉందనే విషయం హౌస్ లో అతనితో మాట్లాడుతుంటేనే తెలిసింది. సామ్రాట్ ఎప్పుడూ అందరినీ నవ్విస్తూ ఉంటాడు. అందుకే అతనికి క్లోజ్ అయ్యా. దీంతో నన్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

ముఖ్యంగా నా క్యారెక్టర్ నే చంపేస్తున్నారు. కొందరు బూతులు కూడా పెడుతున్నారు. ఒక అబ్బాయితో ఎమోషనల్ గా అటాచ్ కావడంలో తప్పేం లేదు. నేను ఎవరితో స్నేహం చేయాలనే విషయాన్ని కూడా ట్రోలర్స్ డిసైడా చేస్తారా? ఈ ట్రోలింగ్ తో నేను చాలా బాధపడ్డా. కొందరేమో సామ్రాట్ తో పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారు. ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉన్నంత మాత్రాన పెళ్లితో ముడిపెడతారా? సామ్రాట్ నాకు ఎప్పటికీ మంచి ఫ్రెండే. ఈ విషయంలో నాకు మద్దతు పలుకుతున్న వారు కూడా చాలా మంది ఉన్నారు’ అని తేజస్వి చెప్పుకొచ్చింది.

ADVERTISEMENT
Latest Stories