
తెలంగాణ రాష్ట్రం గురించి ఏమైనా వ్రాయాలన్నా చెప్పుకోవాలన్నా ఆ రాష్ట్ర నిరంతర అభివృద్ధి… కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయ ప్రస్థానం గురించే ఎక్కువగా చెప్పుకోవలసి ఉంటుంది. తెలంగాణ అభివృద్ధి కళ్లెదుటే కనిపిస్తోంది కనుక దాని గురించి చెప్పుకోనవసరం లేదు. కానీ 2023 సంవత్సరం బిఆర్ఎస్ పార్టీకి కలలో కూడా ఊహించలేని విషాదం మిగిల్చింది.
బిఆర్ఎస్ పార్టీ: 2023 సంవత్సరం పొడవునా కేసీఆర్, కేటీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు చివరికి గల్లీ స్థాయి బిఆర్ఎస్ నేతలు కూడా ప్రధాని నరేంద్రమోడీ గురించి చాలా చులకనగా మాట్లాడుతూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు అదే బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీవైపు కేసీఆర్ ప్రభృతులు చూడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణలో ఓటమి కేసీఆర్ జాతీయ రాజకీయాలను కూడా దెబ్బ తీసే అవకాశం కనిపిస్తోంది.
బీజేపీ: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం దాదాపు ఖాయమనే నమ్మకం కల్పించిన ఏకైక వ్యక్తి బండి సంజయ్. కానీ బీజేపీ అధిష్టానం ఎన్నికలకు ముందు ఆయనని తప్పించేసుకొని ఓ చారిత్రాత్మక పొరపాటు చేయడం వలన తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగాల ఓ గొప్ప అవకాశాన్ని చేజార్చుకొందని చెప్పక తప్పదు.
కాంగ్రెస్ పార్టీ: బీజేపీ అధిష్టానం బండి సంజయ్‌ని తొలగించుకొని నష్టపోతే, కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిపై పూర్తి నమ్మకం ఉంచి ఆయనకు అండగా నిలబడటం వలననే కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కూడా ఊహించలేనంత వేగంగా దూసుకుపోయి, ఆయనని ఓడించి గద్దె దించడం, తెలంగాణ ఏర్పడిన పదేళ్ళ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం 2023లో అతిగొప్ప పరిణామాలే.
Amit Rai’s Ohh My Dog appears to be getting a fresh lease of life on…
Anukreethy Vas makes a simple lace and denim pairing feel like a proper fashion moment.…