
2023 తెలంగాణ ఎన్నికలలో గెలుపు కోసం అధికార బిఆర్ఎస్ పార్టీకి ధీటుగా టి. కాంగ్రెస్ కూడా తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తుంది. గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పటి ఎన్నికల ప్రచారంలో టి. కాంగ్రెస్ పార్టీ బాగా అప్ డేట్ అయినట్టు కనపడుతుంది.ఎన్నికల ప్రచారంలో అన్ని రాజకీయ పార్టీలకు ఆయువుపట్టుగా మారింది సోషల్ మీడియా.గత ఎన్నికలలో కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడనికి సోషల్ మీడియా కూడా ఒక ముఖ్య పాత్ర పోషించిందనే చెప్పాలి.
ఇప్పుడే ఇదే అస్త్రాన్ని కాంగ్రెస్ కూడా గట్టిగా వాడుకోవడానికి సిద్దమయ్యినట్టుంది. అటు బీజేపీ అధిష్టానం రాహుల్ మీద చేసిన మీమ్స్ కు ధీటుగా ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది కాంగ్రెస్ సోషల్ మీడియా. ఇప్పుడు ఇదే సోషల్ మీడియా వేదికగా అధికార బిఆర్ఎస్ పార్టీ పై పేరడీ సాంగ్స్, అధికార పార్టీ నేతల మీద మీమ్స్ చేస్తూ సామజిక మాధ్యమంలో మాంచి సందడి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. రీసెంట్ గా రిలీజ్ అయ్యి విజయం సాధించిన జైలర్ మూవీలో తమన్నా స్పెషల్ సాంగ్ ను కేసీఆర్ పై పేరడీ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
“పో…పో ..నువ్వు పోవాలయ్యా తాతయ్య..!”అంటూ కేసీఆర్ ను ఉద్దేశించి ఆ పేరడీ సాంగ్ ను విడుదల చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు. అయితే ఇప్పుడు ఆ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ట్రెండ్ కు తగ్గట్టు బాగానే అప్ డేట్ అయ్యారు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
అయితే పేరడీలతో అప్ డేట్ అయ్యారు అనేలోపే మేమేం మారలేదు అంటూ కొందరు సీనియర్లు మీడియా ముందుకు వచ్చి సొంత పార్టీ నేతల పైనే వ్యతిరేక స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. దశాబ్దాల అనుభవంతో పార్టీలో సంపాదించుకున్న స్వాతంత్య్రం ఇప్పటికిప్పుడు మారుతుందా చెప్పండి మరి. వీరికి ఇటు ట్రెండ్ తోనూ అటు టైమింగ్ తోనూ ఎటువంటి సంబంధం ఉండదు. ఫ్లోలో అలా వెళ్లిపోతుంటారు అంతే.
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…
An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…