
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ నేడు విచారణకు హాజరు కావాలంటూ సిట్ అధికారులు నిన్న నోటీస్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమెను బహిష్కరించిన తర్వాత కాళేశ్వరం కేసులో ఇలాగే నోటీస్ పంపిస్తే, కల్వకుంట్ల కవిత ఇందిరా పార్క్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. కానీ అంతకంటే ప్రమాదకరమైన ఈ కేసులో తండ్రికి నోటీస్ ఇస్తే, ఆమె స్పందన అనూహ్యంగా ఉంది.
ముందుగా ఆమె ఏమన్నారో చూద్దాం. “మున్సిపల్ ఎన్నికల కోసమే గుంపు మేస్త్రి (సిఎం రేవంత్ రెడ్డి) కేసీఆర్ గారికి ఈ నోటీస్ ఇప్పించారు తప్పితే ఈ కేసు విచారణ పట్ల చిత్తశుద్ధి లేదు. ఇప్పటికైనా ఈ కేసు విచారణ వేగంగా పూర్తి చేసి నేరస్తులకు శిక్షలు పడేలా చేస్తారని ఆశిస్తున్నాను,” అని కవిత అన్నారు.
తన తండ్రి తమ కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయించారని కవిత ఇదివరకే కుండ బద్దలు కొట్టారు. ఇదో లొట్టిపిట్ట కేసు, సిల్లీ డ్రామా, ట్రాష్, కార్తీక దీపం డెయిలీ సీరియల్ అంటూ ప్రభుత్వాన్ని, విచారణ జరుపుతున్న పోలీసులను కేటీఆర్, హరీష్ రావు ఎద్దేవ చేస్తుంటారు.
సిట్ అధికారులు నోటీస్ ఇస్తే విచారణకు బయలుదేరేముందు, ముగించుకొని బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నిప్పులు చెరుగుతారు. కానీ సొంత చెల్లి కవిత చేసిన ఈ సంచలన ఆరోపణని కేటీఆర్ ఖండించరు. కనీసం స్పందించరు. అంటే అర్థం ఏమిటి?
పార్టీ నుంచి బయటకు గెంటేసినా మొదట్లో ‘నా తండ్రి దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు తిరుగుతున్నాయని’ కవిత తండ్రిని వెనకేసుకు వచ్చేవారు. కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేగవంతం చేసి, నేరస్తులను జైలుకి పంపించాలంటున్నారు. అంటే తండ్రి పట్ల ఆమె వైఖరి పూర్తిగా మారినట్లు అర్ధమవుతోంది. తండ్రిని జైలుకి పంపించాలని ఆమె కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచిస్తున్నట్లే ఉంది కదా?
రాజకీయాలలో అన్నా-చెల్లెళ్ళ బంధాలు దెబ్బ తినడం చూశాము. ఇప్పుడు తండ్రీ కూతుర్ల బంధాలు కూడా దెబ్బ తినడం చూస్తుంటే రాజకీయాలు ఎంత దిగజారిపోతున్నాయో కదా? అనిపించకమానదు.
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…