Telugu

కేసీఆర్‌, కేటీఆర్‌ లేకున్నా తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం!

హైదరాబాద్‌లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ తొలిరోజున తెలంగాణ రాష్ట్రానికి రూ.2.43 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. నేటి సదస్సులో మరి కొన్ని వేలకోట్లు వచ్చే అవకాశం ఉంది.

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మళ్ళీ విద్యుత్‌ కోతలు మొదలవుతాయి. అవినీతి పెరుగుతుంది. పరిశ్రమలు మూతపడతాయంటూ బీఆర్ఎస్‌ పార్టీ చేసిన దుష్ప్రచారం చేసింది.

ADVERTISEMENT

కానీ అది అబద్దమని ఈ రెండేళ్ళ పాలనలో నిరూపితమైంది. తాజా పెట్టుబడులతో మరోసారి నిరూపితమైంది. అయితే ఏపీలో వైసీపీ నేతల్లాగే తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీ నేతలు కూడా “ఇది గ్లోబల్ సదస్సు కాదు గోబెల్స్ సదస్సు… ఈ పెట్టుబడులు, ఒప్పందాలు అన్నీ ప్రజలను మభ్యపెట్టడానికే,” అని దుష్ప్రచారం మొదలుపెట్టారు.

ఇక్కడ వైసీపీ, అక్కడ బీఆర్ఎస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సదస్సులు నిర్వహించాయి. లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని గొప్పలు చెప్పుకున్నాయి. కానీ కూటమి ప్రభుత్వం, అక్కడ కాంగ్రెస్‌ ప్రభుత్వం సదస్సులు నిర్వహించి రాష్ట్రాలకు పెట్టుబడులు సాధిస్తే మాత్రం అంతా భూటకమని వాదిస్తున్నారు.

అంటే గతంలో వారు కూడా ప్రజలను మభ్య పెట్టేందుకు ఇలాంటి భూటకపు సదస్సులు నిర్వహించారనుకోవాలా?లేదా తమవి భూటక సదస్సులని వారికి తెలుసు కనుక అధికార పార్టీలు నిర్వహిస్తున్న ఈ సదస్సులు భూటకమని వాదిస్తున్నారా?వారికే తెలియాలి.

ప్రజలను మభ్యపెడితే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని వైసీపీ, బీఆర్ఎస్‌ పార్టీల ఓటమితో నిరూపితమైంది. కనుక వాటిని చూసిన ఏపీ, తెలంగాణలో ప్రభుత్వాలు అటువంటి తప్పు చేస్తాయనుకోవడం రాజకీయ అజ్ఞానమే కదా?

ఏపీకి జగన్‌ పరిశ్రమలు, పెట్టుబడులు సాధించగలరనే నమ్మకం ఎవరికీ ఉండేది కాదు. ఆయన కూడా ఎన్నడూ అటువంటి ఆలోచనలు చేయలేదు.

కానీ సిఎం చంద్రబాబు నాయుడుకి పరిశ్రమలు, పెట్టుబడులు తేగల సామర్ధ్యం, గుడ్‌విల్ రెండూ ఉన్నాయని అందరికీ తెలుసు. అవి నిరూపించి చూపుకుంటున్నారు కూడా.

ఇదేవిధంగా తెలంగాణలో కేసీఆర్‌, కేటీఆర్‌ మాత్రమే రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు సాధించగలరనే భ్రమని సిఎం రేవంత్ రెడ్డి మరోసారి పటాపంచలు చేశారు.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ‘అభివృద్ధిలో పోటీ పడదాం’ అని తెలంగాణ సిఎం కేసీఆర్‌కి పదేపదే చెపుతుండేవారు. కానీ అయన ఏం చేశారో అందరికీ తెలుసు.

ఇప్పుడు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు రెండేళ్ళ వ్యవధిలోనే పోటాపోటీగా ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తుండటం, అయినా ఎటువంటి ఈర్ష్యాద్వేషాలు లేకుండా ముందుకు సాగుతుండటం చాలా అభినందనీయం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Big Violence Loading @ Cockroach Protest On Oct 10?

The Cockroach Janta Party movement is stepping up its protests against the central government and…

25 minutes ago

రాహుల్ కోసం రేవంత్‌… రిస్క్ తీసుకుంటున్నారా?

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి రాష్ట్ర రాజకీయాలలో తన సత్తా చాటుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఓ గుర్తింపు…

33 minutes ago