
ఫోన్ టాపింగ్ కేసు విచారణను తెలుగు హిట్ సినిమా హిట్-1, 2,3 సినిమాలతో పోల్చారు కేటీఆర్. ఆ సినిమాల సీక్వెల్స్ మాదిరి తెలంగాణలో సిట్ సిరీస్ నడుస్తుందన్నారు. అయితే ఆ సిరీస్ లో ఇప్పటికి కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి సిట్ -1 హరీష్, సిట్ – 2 సంతోష్, సిట్ – 3 కేటీఆర్, సిట్ – 4 కేసీఆర్, మరి సిట్ – 5..?
నిన్న నందినినగర్ కేసీఆర్ నివాసంలో జరిగిన సిట్ ఫోన్ టాపింగ్ విచారణ బిఆర్ఎస్ పార్టీలో అసలు ఎం జరుగుతుంది.? భవిష్యత్ లో ఎం జరగబోతుంది అన్న ఆసక్తిని రేకెత్తిస్తుంది.
బిఆర్ఎస్ నుంచి బలంగా తమ గళం వినిపిస్తున్న కేటీఆర్, హరీష్ ఈ ఫోన్ టాపింగ్ కేసు రేవంత్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ లో ఒక భాగం అంటూ కొట్టిపారేస్తున్నారు, కానీ ఈ కేసులో చాల బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని వాటి ద్వారా గత పాలకులకు చట్టపరమైన శిక్షలు తప్పవంటూ మరోపక్క కాంగ్రెస్ మొండిగా వాదిస్తుంది.
ఇక ఇప్పటికే విచారణలో భాగంగా సిట్ అనేకమంది ప్రముఖుల స్టేట్మెంట్స్ రికార్డు చేసింది. అలాగే గత ప్రభుత్వంలో పాలకులకు సహకరించిన ప్రభుత్వ అధికారులను విచారించింది. అయితే ఈ కేసు విషయమై కేసీఆర్ ఇప్పటి వరకు నోరెత్తి ఒక్కమాట కూడా మాట్లాడలేదు, ప్రభుత్వం పై ఒక్క విమర్శ కూడా చెయ్యలేదు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్, పార్టీ ముఖ్య నాయకుడిగా హరీష్ ఒక పక్క ఈ విచారణలు రేవంత్ సర్కార్ పైశాచికత్వాలు, అధికార కాంగ్రెస్ కక్ష్య సాధింపు రాజకీయాలు అంటూ కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తూ పార్టీ శ్రేణులలో భరోసా నింపేందుకు చూస్తున్నారు.
కానీ పార్టీ అధినేతగా, సిట్ విచారణ ఎదుర్కుంటున్న నేతగా కేసీఆర్ మాత్రం ఇప్పటికి మౌనంగానే ఉంటున్నారు. అంటే ఇక పార్టీ బరువు, బాధ్యతలు కేటీఆర్ చేతిలో పెట్టి కేసీఆర్ సిట్ పోజిషన్ లోకి వెళ్లదలచుకున్నారా.? లేక తన మౌనాన్ని కూడా ఒక ఆయుధంగా మలచి పార్టీ భవిష్యత్ అవసరాల కోసం స్టాండ్ గా మారనున్నారా.?
మొత్తానికి నందిని నగర్ లోని కేసీఆర్ నివాసంలో జరిగిన సిట్ ఫోన్ టాపింగ్ కేసు విచారణలో పెద్దాయన కేసీఆర్ మౌనం వహిస్తే, కేసీఆర్ కుడి భుజం హరీష్ మాయమయ్యారు, ఇక చినబాబు కేటీఆర్ మాత్రం రేవంత్ సర్కార్ పై ఘరం అయ్యారు. మరి చిన్నమ్మ కవిత.?
ఇప్పటికే కవిత పలుమార్లు తన తో పాటు తన భర్త ఫోన్ కూడా టాప్ అయినట్టు, ఇంటి అల్లుడి ఫోన్ ఎవరైనా టాప్ చేస్తారా అంటూ పరోక్షంగా బిఆర్ఎస్ ప్రభుత్వం పై టాపింగ్ ఆరోపణలు చేసారు. అలాగే తనను సిట్ అధికారులు సాక్షిగా విచారణకు పిలిచినా వెళ్లి తనవద్ద ఉన్న సమాచారాన్ని అందించేందుకు సిద్ధమంటూ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ఈ ఫోన్ టాపింగ్ సిట్ విచారణ సిరీస్ లో కల్వకుంట్ల కుటుంబం నుంచి ఆ నెంబర్ – 5 కవిత కాబోతున్నారా.? అలాగే ఆ హిట్ సిరీస్ విజయం సాధించినట్టే ఈ సిట్ సిరీస్ కూడా లక్ష్యాన్ని అందుకుంటుందా.? మధ్యలోనే ఆగిపోతుందా.?
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…