చంద్రబాబు అరెస్ట్ తో ఖంగుతిన్న తెలంగాణ టీడీపీ అభిమానులు రాష్ట్రంలో నిరసనలు, ఆందోళనలు చేయడం టీడీపీ ఉనికి ఇంకా తెలంగాణాలో ఉంది అని చెప్పడానికి మచ్చుతునక. అయితే వాస్తవానికి బాబు చేసిన అభివృద్ధి ఫలాలను పొందిన ప్రజలు తమ కృతజ్ఞతను నిరసనల రూపంలో తెలపడం తప్పు కాదు.
తెలంగాణ రాజకీయాలలో టీడీపీ పాత్ర నామమాత్రమే అనే వాస్తవానికి టీడీపీ అభిమానులు రావాలి. చంద్రబాబు అరెస్ట్ పై బిఆర్ఎస్ పెద్దలు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ స్పందించలేదంటూ టీడీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. టీడీపీ పార్టీ బిఆర్ఎస్ పార్టీకి విపక్షమే అవుతుంది కదా! విపక్ష నేతల అరెస్టుల పై ఈ పార్టీ పెద్దలు స్పందించాలని ఆశించడం అవివేకమే అవుతుంది.
కేసీఆర్..జగన్ కు వ్యతిరేఖంగా ఎందుకు స్పందిస్తారు? వీరి మధ్య ఉన్న రహస్య బంధం బహిరంగ సత్యం. తెలంగాణ టీడీపీ అభిమానులు చేస్తున్న అత్యుత్సాహం ఎవరికీ లాభం తెచ్చిపెడుతుందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. అసలే ఏపీలో బాబు అక్రమ అరెస్టుతో సమస్యల వలయంలో చిక్కున్న పార్టీ ఇప్పుడు మరో రాష్ట్ర రాజకీయాలలో పాల్గొనే పరిస్థితులలో లేదు అనే వాస్తవానికి అభిమానులు రావాలి.
అయిన తెలంగాణాలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం ఏర్పడింది. అక్కడ ఉన్న రాజకీయ పార్టీలను ఎదిరించి ఎన్నికలలో పోటీ చేసే పరిస్థితులలో టీడీపీ పార్టీ కానీ ,ఆ పార్టీ నేతలు కానీ లేరు. బాబు అరెస్ట్ అక్కడి ప్రాంత ప్రజల్లో సానుభూతుని కలిగించిన మాట వాస్తవమే కానీ అది రాజకీయాలలో గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో లేదనేది కటిక నిజం. అయితే రాజకీయాలలో ఇది జరగదు అనడానికి ఆస్కారమే లేదు.
తెరాస పార్టీ అధికారంలోకి రావడానికి కొన్ని దశాబ్దాల కాలమే తీసుకుంది. అలాగే ఇప్పుడు దేశంలోనే అశ్వమేధ యాగం చేస్తున్న బీజేపీ కూడా రెండు స్థానాలతో మొదలు పెట్టిందే. అయితే ఒకప్పుడు దేశానికీ కాంగ్రెస్ పార్టీయే దిక్కు అనేలా ఉన్న పరిస్థితుల నుండి ఇప్పుడు ఆ పార్టీకి ఓపెద్ద దిక్కు కోసం ఎదురు చూసే పనిలో ఉంది. అలాగే టీడీపీ పార్టీకి కూడా ఒకప్పుడు ఆయువు పట్టు తెలంగాణనే కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అక్కడ తన పార్టీ ఉనికి కాపాడుకోవడమే కష్టంగా ఉంది. కానీ భవిష్యత్ ల్లో గుర్రం ఎగరావచ్చు.



