రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పార్టీ మారారు. రామచంద్రాపురంలో తోట త్రిమూర్తులు నాలుగుసార్లు గెలుపొంది ఐదోసారి మొన్నటి ఎన్నికలలో ఓడిపోయారు. ఇటీవలే ఎన్నికలలో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన ఆయన కాసేపటి క్రితం ఎం జగన్ సమక్షంలో కడువా కప్పుకున్నారు. ఏపీలో సరైన నాయకుడిని సీఎంగా ఎన్నుకున్నారని… జగన్ న్యాయకత్వంలో
జిల్లా అభివృద్ధి కోసం కృషి చేస్తా అని తోట త్రిమూర్తులు ఈ సందర్భంగా ప్రకటించారు.
తోటకు వైసీపీ కండువా కప్పిన జగన్ సాదరంగా ఆహ్వానించారు. పాలనపై ఉన్న నమ్మకంతో తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని తోట ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మున్ముందు ఎంతమంది పార్టీలోకి వస్తారో మీరే చూస్తారని మీడియా ముఖంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తోట చేసిన వ్యాఖ్యలు టీడీపీ, ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. “జగన్ వంద రోజుల పాలన పై ప్రతిపక్షం విమర్శలు చేయడం తప్ప.. ఇంకేమీ చేయలేరు,” అంటూ నిన్నటిదాకా ఉన్న పార్టీపై విమర్శలు కుప్పించారు తోట త్రిమూర్తులు.
ఎన్నికలకు ముందు తోట త్రిమూర్తులు సోదరుడు తోట నరసింహం కుటుంబంతో సహా వైఎస్సార్ కాంగ్రెస్లో చేరారు. నరసింహం కుటుంబం వైసీపీలో చేరడంతో తోట వాణిని తమ పార్టీ పెద్దాపురం అభ్యర్థిగా బరిలోకి దింపింది. టీడీపీ అభ్యర్థి, అప్పటి డిప్యూటీ ముఖ్యమంత్రి చినరాజప్ప చేతిలో ఆమె ఓడిపోయారు. ఇప్పడు సోదరుడి బాటలోనే త్రిమూర్తులు నడుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈ పరిణామం తెలుగుదేశం పార్టీకి జిల్లాలో ఇబ్బందికరంగా మారవచ్చు.





