
సిఎం చంద్రబాబు నాయుడు నిన్న తిరుపతిలో రెండున్నర లక్షల టిడ్కో ఇళ్ళను లభిదారులకు అందించి వారి చేత సామూహిక గృహ ప్రవేశాలు చేయిస్తే, జగన్ నిర్మించిన ఇళ్ళను చంద్రబాబు నాయుడు తనవిగా చెప్పుకుంటున్నారని వైసీపీ విమర్శలు గుప్పించింది. చివరికి టిడ్కో ఇళ్ళ క్రెడిట్ కూడా బాబు చోరీ చేశారంటూ విమర్శలు గుప్పించింది. కార్టూన్స్ వేసింది.
కానీ వాస్తవమిటో రాష్ట్ర ప్రజలకు తెలుసు. నాడు జగన్ చంద్రబాబు నాయుడుపై అసూయ, ద్వేషంతో అమరావతి మొదలు అన్నాక్యాంటీన్ల వరకు అన్నిటినీ పాడుబెట్టేశారు.
ఆ అసూయతోనే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దశలలో ఉన్న టిడ్కో ఇళ్ళను కూడా పాడుబెట్టేశారు. కానీ చంద్రబాబు నాయుడు హయంలో నిర్మించిన ఇళ్ళకు వైసీపీ రంగులు వేయించుకోవడం క్రెడిట్ చోరీ కదా?
వాటన్నిటికీ వైసీపీ రంగులు వేయడానికి వందల కోట్లు ఖర్చు చేశారు. అదే సొమ్ముతో వాటి బ్యాలన్స్ పనులు పూర్తి చేయించి లబ్దిదారులకు అందించి వాటి పూర్తి క్రెడిట్ జగన్ పొందవచ్చు కదా? ఎవరు వద్దన్నారు?
కానీ విశాఖలో పచ్చటి రుషికొండని చేక్కించేసి బోడిగుండులా మారిన దానిపై పచ్చటి తివాచీలు కప్పి కొండను దాచేయాలనుకున్నట్లు, టిడ్కో ఇళ్ళకు వైసీపీ రంగులేసి ‘మమ’ అనేసుకున్నారు.
ఎందుకంటే జగన్‌కి ప్రచారం కావాలి కానీ పనులు వద్దు కనుక. ఆయన దృష్టి ఎప్పుడూ బటన్ నొక్కడంపైనే ఉండేది గనుక.
గతం గతః అని వదిలేసి కూటమి ప్రభుత్వం టిడ్కో ఇళ్ళ బ్యాలన్స్ పనులు పూర్తిచేసి లబ్దిదారులకు అందిస్తే వారు సంతోషంతో ఉప్పొంగిపోయారు. అది చూసి వైసీపీ కుతకుత ఉడికిపోయి ‘క్రెడిట్ చోరీ’ పాట పాడింది.
కనుక జగన్మోహన్ రెడ్డికి మంత్రి కొల్లు రవీంద్ర జవాబు చెప్పాల్సి వచ్చింది. ఆ జవాబు జీర్ణించుకోవడం కూడా చాలా కష్టమే.
ఒకరి డబ్బు, ఆస్తిపాస్తులను వేరొకరు కొట్టేయవచ్చు. కానీ ఒకరి గుణగణాలను ఎవరూ ఎన్నటికీ కొట్టేయలేరు. జగన్ క్రిమినల్ గుణాలు, ఆలోచనలు, ఆ భావజాలం ఆయనకే సొంతం. వాటి క్రెడిట్ పూర్తిగా ఆయనదే. ఆ క్రెడిట్ ఎవరికీ అవసరం లేదు,” అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
The OTT premiere of Pradhama Drishtiya Kuttakkar on Netflix has sparked discussion among viewers. The…
The wait is finally over! The makers of Ramayana, backed by producer Namit Malhotra, have…