దొంగే దొంగా..దొంగా అన్నట్టుందిగా..!

ఏడూ కొండల మీద వైసీపీ చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్న వేళ, తాజా వివాదమైన శ్రీ వారి లడ్డు ప్రసాదం తయారీ విషయంలో జరుగుతున్న అవకతవల మీద దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నందున తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ దొంగే దొంగ అన్న తీరుగా మాకు న్యాయం చేయండి అంటూ హైకోర్టు ను ఆశ్రయించింది.

ADVERTISEMENT

తమ, తమ ప్రభుత్వం పై కూటమి ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తుందని, తమ రాజకీయ అవసరాల కోసం కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా వెంకన్న ప్రసాదం తయారీలో జంతు కొవ్వు తో కూడిన నెయ్యిని వినియోగించినట్టు టీడీపీ తమ పై దుష్ప్రచారం చేస్తుందని తమ కలవాటైన కోర్ట్ మెట్లెక్కింది వైసీపీ.

నిజంగా ముఖ్యంమత్రి చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వం మీద కేవలం ఆరోపణలు చేసి వదిలేస్తే అవి రాజకీయ విమర్శల కింద భావించాలి. కానీ వాటికీ తగ్గ ల్యాబ్ రిపోర్ట్స్ తో సహా ఉన్న ఆధారాలను ప్రజలు ముందుంచారు. అలాగే దీనికి బాధ్యులైన ప్రతి ఒక్కరి మీద విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ ప్రభుత్వం ప్రకటించింది.

అయితే ఇప్పటికే ఈ ఆరోపణలు మీద స్పందించిన వైవి సుబ్బా రెడ్డి ముఖ్యమంత్రి బాబు చేసిన ఆరోపణలో వాస్తవాలు లేవని, దీని నిరూపణకు తమ కుటుంబం మొత్తం శ్రీవారి పాదాల వద్ద తాము ఎటువంటి తప్పు చేయలేదని ప్రమాణం చేస్తామని, అలాగే బాబు కూడా తన ఆరోపణలకు కట్టుబడి తన కుటుంబంతో కలిసి ప్రమాణానికి సిద్ధమా అంటూ సవాల్ విసిరారు.

దానికి ప్రతిస్పందనగా నారా లోకేష్ మాట్లాడుతూ నేను ఇక్కడ తిరుపతిలోనే ఉన్నాను, సవాళ్లు చేసిన వైసీపీ నేతలు వాటి మాటలకు కట్టుబడి తిరుమల వస్తున్నారా అంటూ వైసీపీకి కౌంటర్ ఇచ్చారు. అయితే ఇటు ఇరు పార్టీల నేతల మధ్య పరస్పర వాదనలు ఉన్నప్పటికీ ల్యాబ్ రిపోర్టుల విషయంలో వాస్తవాలు బయటపడ్డాయి.

దీనితో అడ్డంగా దొరికిన వైసీపీ పొంతన లేని వాదనలు తెర మీదకు తెచ్చి ప్రజలను తప్పుదారి పట్టించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.అందులో భాగంగా ఇది మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చిన నివేదికలు కాబట్టి మా ప్రభుత్వానికి ఏమి సంబంధం అంటూ వితండ వాదన మొదలు పెట్టింది.

అలాగే ప్రభుత్వం బయటపెట్టిన నివేదికలో కూడా శాంపిల్ నెంబర్లు మిస్ మ్యాచ్ అయ్యాయంటూ తమ ఫేక్ ప్రచారానికి తెరలేపింది. అయితే తిరుమల ప్రసాదం తయారీకి గత 50 ఏళ్లుగా వాడే నందిని నెయ్యి అనుమతులు రద్దు చేసి వైసీపీ ప్రభుత్వం టీటీడీలో కొత్తవారికి ఎందుకు టెండర్లు ఇచ్చింది అన్న ప్రశ్నకు వైసీపీ నుంచి ఇప్పటికి సమాధానం లేదు.

స్వచ్ఛమైన ఆవు నెయ్యి దేశీయ మార్కెట్లో 1000 నుండి 1500 లకు పై మాటే పలుకున్న వేళ ఆ సో కాల్డ్ సంస్థలు మాత్రం 280 రూ. అంటూ అంత తక్కువ ధరకు నాణ్యమైన ఆవు నెయ్యిని ఎలా అందించగలుగుతుంది.? దీని వెనుక దాగి ఉన్న ఆ మర్మమేటి.? ఈ విషయంలో కానీ వైసీపీ ప్రభుత్వం తప్పు చేసింది అని తేలితే దాని పర్యవసానాలు జగన్ ఊహకు కూడా అందకపోవచ్చు.

ఇక వైసీపీ హయాంలో టీటీడీ చైర్మన్ గా పదవులు అనుభవించిన వైవి సుబ్బా రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో ధర్మా రెడ్డి తో పాటు ఇటువంటి నేతలకు టీటీడీ బాధ్యతలు అప్పగించిన అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి కూడా శ్రీవారి వారి భక్తుల ఆగ్రహానికి బలికావాల్ససిందే.

అప్పుడు ప్రజా కోర్టులో వైసీపీ కి పడిన శిక్ష నుండి వైసీపీ ని ఏ కోర్టులు కాపాడలేవు అనేది వైసీపీ నేతలు ముఖ్యంగా ఆపార్టీ అధినేత జగన్ గుర్తుపెట్టుకోవాలి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

PM Modi, CM Vijay Take Chennai Metro Ride Together

Prime Minister Narendra Modi inaugurated the Poonamallee-Vadapalani corridor of Chennai Metro Phase II during his…

17 minutes ago

శరన్నవరాత్రులు, విజయవాడ ఉత్సవ్.. ఈ ఉపశమనం అవసరమే!

రాజకీయాలు హుందాగా సాగుతున్నప్పుడే రాష్ట్రాలలో, దేశంలో రాజకీయ వాతావరణం కూడా బాగుంటుంది. కానీ ఇప్పుడు రాజకీయాలలో అటువంటి హుందాతనం తగ్గిపోయింది.…

24 minutes ago