తిరుమల టిక్కెట్ల వివాదం… ఇంకా చంద్రబాబుపైనే నిందలా?

tirumala-ttd-controversy-chandrababu-naiduతిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఆర్టీసీ బస్సు టిక్కెట్ల వెనుక అన్యమత ప్రచారం జరగడంపై పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతుంది. అది కూడా ప్రభుత్వ ప్రకటనలు కావడం అగ్నికి మరింత ఆజ్యం పోసినట్టు అయ్యింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా ఇంకా అప్పటి ప్రభుత్వాన్నే నిందిస్తుంది. ఈ వివాదంపై దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఒక లేఖ విడుదల చేశారు.

“ఈ వివాదానికి కారణం చంద్రబాబు ప్రభుత్వమే. ఆయన హయాంలోనే ఈ టిక్కెట్లు ప్రింట్ అయ్యాయి. అయితే నెల్లూరు బస్సు డిపో లో ఉండాల్సిన టిక్కెట్లు తిరుమల ఎలా వెళ్లాయి అనేదాని మీద దర్యాప్తు చేస్తున్నాం,” అని మంత్రిగా అంటున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం వివాదాన్ని పక్క దారి పట్టించే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వ ప్రకటనలు బస్సు టిక్కెట్ల మీద ముద్రించడం పరిపాటే. ఆ రకంగా చూస్తే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం చేసింది తప్పేమీ కాదు.

ADVERTISEMENT

ఇవే టిక్కెట్లు నెల్లూరు పరిధిలో వాడి ఉంటే తప్పు ఏమీ కాదు. అయితే అవి తిరుమల వెళ్ళడమే వివాదం. తిరుపతి ఎప్పుడు వెళ్లాయి? జగన్ మోహన్ రెడ్డి హయాంలో… అప్పుడు బాధ్యత చంద్రబాబుది ఎలా అవుతుంది? జగన్ అధికారంలోకి వచ్చి అటుఇటుగా నాలుగు నెలలు అవుతుంది ఇప్పటికీ చంద్రబాబుని బూచిగా చూపించడం ప్రభుత్వ వైఫల్యం అనే అనుకోవాలి. మరోవైపు ప్రభుత్వం తనని తాను కాపాడుకోవడానికి విశాఖ శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతిని రంగంలోకి దించింది. ఈ కుట్రకు బాధ్యులెవరో ప్రభుత్వమే నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తూ ఆయన ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చేశారు.

ADVERTISEMENT
Latest Stories