మరో బడా హీరో పొలిటికల్ ఎంట్రీ?

Toilet Ek Prem Katha Trailer Talkబాలీవుడ్‌ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌, భారతీయ జనతా పార్టీలో చేరడం ద్వారా రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు బాలీవుడ్ వర్గాల టాక్. ఇటీవలి కాలంలో సామాజిక అంశాల నేపథ్యంలో తయారవుతున్న సినిమాల్లో అక్షయ్ కుమార్ ఎక్కువగా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజా చిత్రం ‘టాయ్‌లెట్‌ – ఏక్‌ ప్రేమ్‌ కథా’ కూడా ఈ కోవలో చెందినదే కావడం విశేషం. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ‘స్వచ్ఛభారత్‌’ ప్రచారం నేపథ్యంలో తయారైన కథతోనే ఈ సినిమా తెరకెక్కిందని ధియేటిరికల్ ట్రైలర్ స్పష్టం చేసింది.

ADVERTISEMENT

గత నెలలో ఈ చిత్రం గురించి సమాచారాన్ని మోడీకి వెల్లడించేందుకు స్వయంగా వెళ్లిన అక్షయ్, జవాన్ల కోసం ‘భారత్‌ కే వీర్‌’ పేరిట ఓ వెబ్‌ సైట్‌ ను కూడా ప్రారంభించారు. బీజేపీతో పాటు ఆర్ఎస్ఎస్ తోనూ అక్షయ్ దగ్గరవుతున్నారు. ఆర్ఎస్ఎస్ ‘శివ్‌ శక్తి సంఘ్’ పేరిట ఓ కార్యక్రమం చేపట్టగా, దానికి నిధులందించాలని అక్షయ్‌ నిర్ణయించుకున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే, త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం ఉందని సినీ పరిశ్రమ వర్గాలలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories