ప్రస్తుతం చెలరేగుతున్న కుల వివక్షలు అనేక చర్చలకు దారి తీస్తున్నాయి. ఈ “కుల వ్యవస్థ – రిజర్వేషన్లు”పై ఒక్కొక్కరిది ఒక్కో ఖచ్చితమైన అభిప్రాయం ఉంది. రిజర్వేషన్లను సమర్ధించే వారు కొందరైతే, అర్హత ప్రకారమే అందలం ఎక్కించాలనే వారు మరికొందరు. ఇలా ఒక్క ఏపీ, తెలంగాణాలలోనే కాక, కుల చిచ్చు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.
దీంతో కొందరు నెటిజన్లు ఈ కుల వ్యవస్థకు మరింత క్రియేటివిటీ జోడించి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. 2020 నాటికి భారతదేశంలో కులాలకు ఈ విధమైన టోల్ గేటు విధానాలు ఉంటాయని చూపిస్తూ పోస్ట్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా సందడి చేస్తోంది. అత్యధికంగా ఓ.సి.లకు 100 రూపాయలు టోల్ గేటు చార్జీ ఉండగా, అతి తక్కువగా ఎస్సీ వర్గాలకు 5 రూపాయల నామమాత్రపు చార్జీలు ఉన్నాయి.
అయితే ఎస్సీల కంటే తక్కువగా సంపాదించే (కంగారు పడకండి… అధికారికంగా వచ్చే మొత్తంలేండి) రాజకీయ నాయకులకు మాత్రం ఎటువంటి చార్జీలు లేకుండానే జాతీయ రహదారులపై ప్రయాణించవచ్చు. కుల వ్యవస్థకు సైటైరికల్ గా రూపొందించిన ఈ ఫోటోకు నెటిజన్ల ఆదరణ బాగా చూరగొంటోంది.





