టాలీవుడ్ లో అప్రకటిత బంద్!

Tollywood bandh for Nandamuri Harikrishna demiseనందమూరి హరికృష్ణ అకాల మరణంతో టాలీవుడ్ లో అప్రకటిత బంద్ వాతావరణం నెలకొంది. నిజానికి ఈ రోజు నాగార్జున పుట్టినరోజు కావడంతో, అక్కినేని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు. అలాగే నాగ్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘దేవదాస్’ సినిమా నుండి మొదటి పాట విడుదల కావాల్సి ఉంది. ఇవి కాక మరికొన్ని సినిమాల పోస్టర్స్, టీజర్లు కూడా విడుదల కావాల్సి ఉంది.

ADVERTISEMENT

[m9ad]

కానీ ప్రస్తుతం అలాంటి హంగామా ఏమీ లేదు. టాలీవుడ్ సెలబ్రిటీలంతా తమ సందేశాలను ట్విట్టర్, ఫేస్ బుక్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తం చేస్తుండగా, అందుబాటులో ఉన్న మరికొందరు సెలబ్రిటీలు స్వయంగా నార్కెట్ పల్లిలోని హరికృష్ణ మృతదేహాన్ని సందర్శిస్తున్నారు. దీంతో ఉత్సాహంలో ఉరకలేస్తుందనుకున్న టాలీవుడ్ ఒక్కసారిగా మూగబోయింది.

ADVERTISEMENT
Latest Stories