థియేటర్లు ఓపెన్ కాగానే టాలీవుడ్ కొత్త ప్రయోగం?

tollywood Movie Theatres openingవచ్చే నెల నుండి ప్రస్తుతం లాక్ డౌన్ లో ఉన్న అన్ని ప్రదేశాలను ఓపెన్ చెయ్యాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందని సమాచారం. వీటిలో భాగంగా సినిమా థియేటర్లు కూడా ఓపెన్ కాబోతున్నాయని అంటున్నారు. మరోవైపు తెలుగు నిర్మాతలు ఇప్పటికే తమ థియేట్రికల్ విడుదలను దాటవేసి తమ చిత్రాలను ఆన్ లైన్ లో విడుదల చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు.

ADVERTISEMENT

ఇప్పటికే నాని, సుధీర్ బాబు నటించిన ‘వీ’ వచ్చే నెల 5న అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల అవుతుందని ప్రకటించారు. మరికొన్ని సినిమాల ప్రకటన ఈ నెలలోనే ఉండవచ్చని అంటున్నారు. ఈ సినిమాలను ఆన్ లైన్ లో విడుదల చెయ్యడంతో పాటు కొన్ని థియేటర్లలో విడుదల చేస్తే ఎలా ఉంటుందని నిర్మాతలు ఆలోచిస్తున్నారు.

తక్కువ రేట్లకు థియేటర్లలో విడుదల చేసి ప్రేక్షకుల మూడ్ ని అంచనా వేసే ప్రయత్నాం చెయ్యాలని వారి భావన. ప్రేక్షకులకు సినిమాలను అలవాటు చేస్తే కనీసం క్రిస్మస్ లేదా సంక్రాంతి నాటికి పెద్ద సినిమాలను థియేటర్లలోకి తీసుకుని రావాలని వారి ఆలోచన. అయితే దీనికి ఓటీటీలు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది.

థియేటర్లు కూడా పాత సినిమాలు ప్రదర్శించే కంటే ఇటువంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చెయ్యవచ్చు. ఓటీటీలు అందుబాటులో లేని వర్గాలు సినిమా థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ టైములో థియేటర్లు ఓపెన్ చెయ్యడానికి ముల్టీప్లెక్స్లు తప్ప చిన్న థియేటర్లు సాహసం చేసే అవకాశం ఉండకపోవచ్చని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories