మిర్చి 9 టాప్ 10 మార్చి పాపులర్ స్టార్స్

Top 10 Tollywood Celebs March 2023వినూత్న రీతిలో ఈ ఏడాది జనవరి నుంచి మొదలుపెట్టిన మిర్చి 9 టాప్ టెన్ మోస్ట్ పాపులర్ స్టార్స్ శీర్షికకు పరిశ్రమ, అభిమానులతో పాటు అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన దక్కింది. ప్రతి నెల మీడియాతో పాటు సామాజిక అనుసంధాన ప్లాట్ ఫార్మ్స్ లో అత్యంత ప్రజాదరణ సంపాదించుకుని పేరు తెచ్చుకున్న పది మందిని ఎంపిక చేసి ఆ ఘనత వెనుక కారణాలు కూడా వివరించడం జరిగింది. మార్చి నెల ఎన్నో సంచలనాలకు సెలబ్రిటీలకు చోటు కల్పించింది. అదేంటో చూద్దాం

1. ఆస్కార్ వరించిన ఆర్ఆర్ఆర్

ADVERTISEMENT

భారతీయ ఫిలిం మేకర్స్ కు దశాబ్దాల స్వప్నంగా మిగిలిపోయిన ఆస్కార్ పురస్కారాన్ని కోట్లాది ప్రేక్షకులు చూస్తుండగా ఎంఎం కీరవాణి చంద్రబోస్ లు సగర్వంగా అందుకోవడం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. నామినేషన్ల దశ నుంచే రాజమౌళి తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ, దేశవిదేశాలు తిరుగుతూ ఇద్దరు హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను తీసుకెళ్లి పడిన కష్టానికి తగిన అద్భుత ఫలితం దక్కింది. జాతీయ మీడియాతో పాటు ఇంటర్నేషనల్ లెవెల్ లో నాటు నాటు పాట గురించిన వచ్చిన కవరేజ్ అమోఘం

2 . నాని

ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న న్యాచురల్ స్టార్ నాని పూర్తి మేకోవర్ కు వెళ్ళిపోయి చేసిన దసరా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకుంది. మొదటి రోజే ముప్పై ఎనిమిది కోట్ల గ్రాస్ సాధించడం ట్రేడ్ ని నివ్వెరపడింది. తను కూడా ఊర మాస్ చేయొచ్చని నిరూపించడమే కాదు టైర్ 1 లీగ్ లోకి వెళ్ళడానికి మార్గాన్ని మరింత సులువుగా చేసుకుని టాక్ అఫ్ ది టౌన్ అయ్యాడు

3. వెంకటేష్ రానా నాయుడు

కుటుంబ ప్రేక్షకుల్లో మంచి గౌరవం ఉన్న విక్టరీ వెంకటేష్ రానా నాయుడు లాంటి బూతు కంటెంట్ తో వెబ్ సిరీస్ చేయడం అధిక శాతం ఆడియన్స్ జీర్ణించుకోలేకపోయారు. పెద్దలకు మాత్రమేనని రానా ముందే చెప్పినా మరీ దారుణంగా ఉండదులెమ్మని లుక్కేసిన వాళ్ళు షాక్ తిన్నారు. అవసరం ఉన్నా లేకపోయినా అశ్లీలతను జోడించడం నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటిటిలకు పరిపాటిగా మారింది

4. వెంకటేష్ మహా

దర్శకుడిగా తీసిన రెండు సినిమాల కంటే ఎక్కువ పాపులారిటీ వెంకటేష్ మహా సోషల్ మీడియాలో వైరల్ కావడం ద్వారా తెచ్చుకున్నాడు. కెజిఎఫ్ లో రాఖీ భాయ్ క్యారెక్టరైజేషన్ గురించి ఒళ్ళు మర్చిపోయి ఓ ఇంటర్వ్యూలో కామెంట్ చేయడం అతనితో పాటు ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్న మిగిలినవాళ్ళను ఇబ్బందులకు గురి చేసింది. వివేక్ ఆత్రేయ, నందినిరెడ్డిలు సారీలు చెప్పేశారు

5. ప్రభాస్ (ఆదిపురుష్)

ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా హీరోతో ఆది పురుష్ తీసిన టి సిరీస్ దాని ప్రమోషన్ విషయంలో చూపిస్తున్న అలసత్వం విపరీతమైన విమర్శలకు దారి తీస్తోంది. టీజర్ కు వచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ ని పట్టించుకున్నట్టు నటించి శ్రీరామనవమి నాడు రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ తో మరింత రచ్చకు చోటిచ్చారు. రాముడు సీత వేషధారణను క్రియేటివిటీ పేరుతో పక్కదారి పట్టించడం డ్యామేజిని ఇంకా పెంచేసింది

6. మహేష్ బాబు

సర్కారు వారి పాట, సరిలేరు నీకెవ్వరులు కమర్షియల్ గా హిట్ అయినా అవి మహేష్ స్థాయి సినిమాలు కాదని అభిమానులు ఫీలవుతున్న టైంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబి 28 ఫస్ట్ లుక్ ఓ రేంజ్ లో సోషల్ మీడియాని ఊపేసింది. ప్రచారంలోకి వచ్చిన టైటిల్స్ తోనూ విపరీతమైన ప్రచారం దక్కించుకున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు మాములుగా లేవు

7. మంచు విష్ణు

మంచో చెడో ప్రతిదానికి ట్రోలింగ్ వర్గాలకు టార్గెట్ అవుతున్న మంచు ఫ్యామిలీ వీడియో ఒకటి కొద్దిరోజుల క్రితం ఓ రేంజ్ లో హడావిడి చేసింది. మనోజ్ బంధువుల మీద విష్ణు దాడి చేస్తున్నట్టుగా ఉన్న దృశ్యాలు ఏకంగా న్యూస్ ఛానల్స్ లో డిబేట్ కు దారి తీశాయి.తర్వాత విష్ణు ఇదంతా ఒక రియాలిటీ షో కోసం తమ కుటుంబం చేసిన ప్రోగ్రాంలో భాగమని చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు

8. శోభిత చైతు

సెలబ్రిటీలకు సంబంధించిన ఒక చిన్న ఫోటో ట్విట్టర్ లోనో ఇన్స్ టాలోనో పెడితే అది ఎంత దూరం వెళ్తుందో చెప్పడానికి చైతు శోభిత ధూళిపాళ పిక్ ఉదాహరణగా తీసుకుంటే చాలు. ఒక చెఫ్ తో నాగ చైతన్య తీసుకున్న ఫోటో వెనుక చేతుల వెనుక మొహం దాచుకున్న శోభిత కనిపించడమే రకరకాల ఊహాగానాలకు దారి తీసింది. వీళిద్దరి బంధం నిజమేనంటూ నెటిజెన్లు ఎవరికి వారు విశ్లేషణ చేసేశారు

9. సమంతా

టీవీ ఇంటర్వ్యూలలో తారలు మాట్లాడే విషయాలను చాలా తెలివిగా కత్తెర వేసి తమకు అనుకూలంగా మార్చుకుని వైరల్ టాపిక్ సృష్టించేందుకు కొన్ని టీవీ ఛానల్స్ ఎంత దూరం వెళ్తాయో చెప్పడానికి సామ్ ఉదంతం చాలు. శాకుంతలం ఇంటర్వ్యూలో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని సంగతులు చెబితే వాటిని అక్కినేని అభిమానులకు టార్గెట్ అయ్యేలా వక్రీకరించడంతో వ్యవహారం పక్కదారి పట్టింది. పూర్తి వీడియోని ప్రసారం చేయకుండా ఇలా డబుల్ స్టాండర్డ్ ప్లే చేయడం వెనుక మర్మం వాళ్ళకే ఎరుక

10. కొరటాల శివ

బ్లాక్ బస్టర్ ఇచ్చినా డిజాస్టర్ ఇచ్చినా ఒక దర్శకుడి మీద సుదీర్ఘ కాలం ఫోకస్ ఉంటుందని చెప్పడానికి కొరటాల శివని మించిన ఉదాహరణ అక్కర్లేదు. ఎన్టీఆర్ 30 లాంచ్ సందర్భంగా కొరటాల ఇచ్చిన ప్రసంగాన్ని మెగా ఫ్యాన్స్ ఆచార్య ఫలితానికి ముడిపెట్టి అవసరం లేని చర్చకు దారి తీసి ట్రెండింగ్ అయ్యేలా చేశారు. తారక్ తో పాటు తన అభిమానులు మాత్రం ఈ ప్రాజెక్ట్ పట్ల చాలా నమ్మకంగా ఉన్నారు.

ADVERTISEMENT
Latest Stories