సినిమా లాంగ్వేజ్ బేరియర్స్ దాటుకుని ఎప్పుడో ప్రపంచవ్యాప్తం అయిపోయింది. ఇక అన్నీ భాషల ప్రేక్షకుల్లో తెలుగు ఆడియన్స్ ది బెస్ట్ అనేది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. అందుకే వేరే భాషల నటులు, దర్శకనిర్మాతలు తమ సినిమాల్ని తెలుగులో డబ్బింగ్ రూపంలో విడుదల చేయడానికి ఉవ్విళ్లూరుతుంటారు.
అయితే.. ఒక సినిమాని ప్రేమిస్తే ఎంత ఆస్వాదిస్తారో, సినిమా బాలేదంటే అంతే ఇమ్మీషియట్ గా డిస్ ఓన్ చేసేసుకుంటారు. ఇదేమీ పరభాషా సినిమాలకి మాత్రమే పరిమితం కాదు.. తెలుగు భారీ బడ్జెట్ సినిమాలైనా అదే పరిస్థితి.
ఈ విషయాన్ని వేరే రాష్ట్రాల ప్రేక్షకులు, సోషల్ మీడియా క్రిటిక్స్ సరిగా అర్థం చేసుకున్నట్లు లేరు. నిన్నటి నుండి టాక్సిక్ కి తెలుగోళ్ళు కావాలనే నెగిటివ్ చేసేస్తున్నారని కొందరు కన్నడ జనాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా.. మీ తెలుగు సినిమాల్ని కర్ణాటకలో ఆడనివ్వం అంటూ వార్నింగ్ లు ఇస్తుండడం అనేది కామెడీ.
ఆది సరిపోదన్నట్లు.. భాషా బేధాలు, గొడవలు అంటూ అనవసరమైన ఆన్ లైన్ వార్స్ సృష్టిస్తున్నారు. ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో “పొన్నియన్ సెల్వన్” సినిమా టైంలో కూడా తమిళ ఆడియన్స్ అండ్ సోషల్ మీడియా క్రిటిక్స్ తెలుగోళ్ళ మీద విరుచుకుపడ్డారు. కొందరు ఇచ్చిన వార్నింగ్స్ కి జనాలు కూడా నవ్వుకున్నారు.
అయినా సినిమా బాలేదు అని ఒపీనియన్ చెప్పినంత మాత్రాన.. లాంగ్వేజ్ అండ్ రీజనల్ వార్స్ సృష్టించి తెలుగోళ్లను టార్గెట్ చేయడం అనేది అత్యంత నీచమైన సంస్కృతి.





