
ఈ నేపథ్యంలో, ఈ ఆఫర్ నిబంధనల ఉల్లంఘన కిందకు ఎలా రాదో తెలపాలని రిలయన్స్ జియోను ట్రాయ్ పేర్కొంది. తాము జియోకు ఈ మేరకు ఇటీవలే ఓ లేఖను పంపించామని, జియో నుంచి త్వరలోనే సమాధానం వస్తుందని తాము అనుకుంటున్నట్లు ట్రాయ్ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. జియో డేటా ఆఫర్ లో స్వల్ప మార్పు తప్ప పాత ఆఫర్ కు పొడిగింపుగానే కొత్త ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా తాము భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, జియోకు ప్రకటించిన తాజా ఆఫర్ కు వ్యతిరేకంగా మరో టెలికాం సంస్థ ఎయిర్ టెల్ టెలికం వివాదాల పరిష్కార ట్రైబ్యునల్ ను ఆశ్రయించి, జియో ప్రకటించిన తాజా ఆఫర్‌కు అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించింది. జియో మొదట్లో ప్రకటించిన ‘వెల్ కమ్ ఆఫర్’ ముగిసిన అనంతరం కూడా మరో ఫ్రీ ఆఫర్ కొనసాగింపునకు అనుమతినివ్వడం ఏంటని అడిగింది. దీంతో రంగంలోకి దిగిన ట్రాయ్, తమ చర్యలలో భాగంగా ఈ నోటీసులను అందించింది.
Ram Charan and his family celebrated Sri Krishna Janmashtami at home. A picture from their…
Toxic has emerged as a big disaster at the box office. The movie had a…