పిక్ టాక్ : ‘సెల్ఫీ’లో త్రివిక్రమ్!

Nitin Reddy -samantha-Trivikram Srinivas‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “అ…ఆ…” నితిన్, సమంత జనతా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. సమ్మర్ కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

తాజాగా ఈ సినిమా సెట్స్ లో హీరో నితిన్ తీసిన ఓ సెల్ఫీ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్, హీరోయిన్ సమంతలతో కూడిన ఈ ఫోటో పల్లెటూరు వాతావరణంలో చిత్రీకరించారు. సాధారణంగా డైరెక్టర్ త్రివిక్రమ్ ఇలాంటి రొటీన్ విషయాలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. దీంతో ‘మాటల మాంత్రికుడు’ ఫ్యాన్స్ ఈ ఫోటోను షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories