‘అత్తారింటికి దారేది’ సెంటిమెంట్ ఫాలో అయిన త్రివిక్రమ్!

Trivikram Srinivas-AA-AAA-First look -6సూపర్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో “అత్తారింటికి దారేది” వంటి ఒక కుటుంబ కధాచిత్రాన్ని తెరకెక్కించి ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డులు అందుకున్న ఘనత త్రివిక్రమ్ శ్రీనివాస్ ది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం… టైటిల్ ప్రకటన నుండి సినిమా విడుదల తేదీ వరకు మొత్తం సమంత చేతుల మీదుగానే జరిగాయి. అయితే అప్పట్లో సమంత లీక్ చేసింది అనుకున్నారు గానీ, చిత్ర యూనిట్ నిర్ణయం ప్రకారమే ‘కుందనపు బొమ్మ’ సమాచారం ఇచ్చిందని సినిమా విడుదల తర్వాత తెలిసి వచ్చింది.

ADVERTISEMENT

బహుశా ఈ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయ్యిందనుకున్నారో ఏమో గానీ, త్రివిక్రమ్ తాజా చిత్రం “అ…ఆ…” ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా సమంతనే విడుదల చేసింది. “త్రివిక్రమ్ సినిమాలలో బెస్ట్ సినిమా ఇదని, అందరి చేత నవ్వులు పూయిస్తుందని, మొదటి లుక్ ను విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉందని” చెప్తూ ఆహ్లాదకరమైన “అ…ఆ…” పోస్టర్ ను విడుదల చేసింది ముద్దుగుమ్మ.

పల్లెటూరి వాతావరణంలో చుట్టూ పచ్చని పొలాల నడుమ గుర్రపు బండిలో సమంత, ఆ పక్కనే నితిన్ చేతిలో ఒక ధాన్యపు మొక్కను పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్న ఫోటో వీక్షకులను ఆకట్టుకుంటోంది. మరి త్రివిక్రమ్ అనుసరిస్తున్న సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా కనీసం నితిన్ కెరీర్ లో బెస్ట్ సినిమాగా నిలబడాలి.

ADVERTISEMENT
Latest Stories