త్రివిక్రమ్ – నాని కాంబోలో షాట్!

Trivikram Srinivas claps for nani jersey movie shootవరుస సక్సెస్ లతో మంచి ఊపుమీదున్న నాచురల్ స్టార్ నానికి ‘కృష్ణార్జున యుద్ధం, దేవదాస్’ రూపంలో రెండు బ్రేకులు పడ్డాయి. దీంతో తదుపరి సినిమా ఎంతో కీలకంగా మారిన నేపధ్యంలో… గౌతమ్ తిన్ననురి దర్శకత్వంలో “జెర్సీ” అనే సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుగగా, మొదటి షాట్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ కొట్టారు.

[m9ad]

ADVERTISEMENT

క్రికెట్ ప్రధానాంశంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇదివరకే విడుదల చేసారు. బెంగుళూరు బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రేపటి నుండి జరగనుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ‘శైలజారెడ్డి అల్లుడు’ ఫేం సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించనుంది.

ADVERTISEMENT
Latest Stories