త్రివిక్రమ్… ఎటూ తేల్చుకోలేకపోతున్నారా..?

trivikram srinivas dilema over next project‘అజ్ఞాతవాసి’ దారుణ పరాజయం తర్వాత ‘అరవింద సమేత’తో బౌన్స్ బ్యాక్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తదుపరి చిత్రం ఏ హీరోతో చేయబోతున్నారు? విక్టరీ వెంకటేష్ తో ఒక సినిమా చేయబోతున్నానని ఇదివరకే త్రివిక్రమ్ ప్రకటించిన దరిమిలా, వెంకీ ప్రాజెక్ట్ దిశగా అడుగులు వేస్తున్నారా? లేక ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ కాంబోకు శ్రీకారం చుట్టబోతున్నారా? అంటే…

ADVERTISEMENT

[m9ad]

‘నా పేరు సూర్య’ తర్వాత మరో ప్రయోగానికి తావిచ్చేది లేదని డైరెక్టర్ విక్రమ్ కుమార్ ను కూడా పక్కన పెట్టిన బన్నీ, మాటల మాంత్రికుడుతోనే ముందుకు వెళ్ళాలని భీష్మించుకుని కూర్చున్నారట. ‘అరవింద సమేత’ విడుదల తర్వాత అది పక్కాగా నిర్ణయం కావడంతో, మెగా హీరోతో సినిమా చేయాలని త్రివిక్రమ్ పై ఒత్తిడి పెరిగినట్లుగా సమాచారం.

ఇదే సమయంలో అటు వెంకీ కూడా ఇతర ప్రాజెక్ట్ లతో బిజిగా ఉండడంతో, బన్నీ – త్రివిక్రమ్ కాంబో సెట్స్ పైకి వెళ్ళబోతుందన్న టాక్ ఊపందుకుంది. దాదాపుగా ఇదే ఫైనల్ అయ్యిందని లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం. దీంతో గత కొన్ని నెలలుగా అల్లు అర్జున్ సినిమా కోసం వేచిచూస్తున్న అభిమానులకు ఇది తీపికబురులాంటిది. అయితే ఇది అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories