త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రొజెక్ట్ ఖరారు!

Trivikram-Srinivas---Aravindha-Sametha-Teaserత్రివిక్రమ్ శ్రీనివాస్ – జూనియర్ ఎన్టీఆర్ ల కాంబోలో ప్రస్తుతం “అరవింద సమేత” సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అక్టోబర్ నాటికి ఈ సినిమా హంగామా అంతా పూర్తి కానున్న నేపధ్యంలో…. తన తదుపరి ప్రాజెక్ట్ పై కూడా మాటల మాంత్రికుడు కసరత్తులు ప్రారంభించారట. ఇందులో విక్టరీ వెంకటేష్ హీరోగా కనిపించబోతున్నారనేది లేటెస్ట్ న్యూస్.

[m9ad]

ADVERTISEMENT

నిజానికి ఈ కధను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీయాల్సి ఉండగా, ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్ళిన దరిమిలా, ఇప్పట్లో సినిమా చేసే ఉద్దేశం లేకపోవడంతో, ఇక ఈ ప్రాజెక్ట్ ను మరో హీరోతో తెరకెక్కించడమే సమంజసమని భావించి, వెంకీకి వినిపించడం, ఓకే చేయించుకోవడం జరిగిపోయినట్లుగా ట్రేడ్ టాక్. ‘అరవింద సమేత’ తర్వాత త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదేగా ఖరారయ్యింది.

మరోవైపు “ఎఫ్ 2” సినిమాలో వరుణ్ తేజ్ తోనూ, “వెంకీమామా” సినిమాలో నాగచైతన్యతోనూ మల్టీస్టారర్ సినిమాలు చేస్తోన్న విక్టరీ, ఈ రెండింటి తర్వాత సోలో హీరోగా కనిపించడం అభిమానులకు ఆనందదాయకంగా మారింది. అది కూడా ‘నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి’ వంటి బ్లాక్ బస్టర్స్ ఉన్న త్రివిక్రమ్ కాంబో కావడం మరింత సంతోషాన్ని కలిగించే అంశం. అయితే అఫీషియల్ ప్రకటన కోసం వెయిటింగ్!

ADVERTISEMENT
Latest Stories