త్రివిక్రమ్ గైడెన్స్… పవన్ ఫాలోయింగ్..!

Trivikram on pawan-kalyan dietరాబోతున్న పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంభినేషన్ లోని సినిమాలో పవన్ లుక్ ఫ్యాన్స్ కు కిక్ ను పంచే విధంగా ఉంటుందన్న విషయం ఇటీవల సోషల్ మీడియాలో లీక్ అయిన పలు ఫోటోలు స్పష్టం చేసాయి. అలాగే రాజకీయ వేదికలపై మీడియా ముందుకు వస్తున్న తరుణంలో కూడా మునుపటితో పోలిస్తే పవన్ కళ్యాణ్ మరింత చార్మింగ్ గా కనపడుతుండడంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉంటున్నారు.

అయితే దీని వెనుక రహస్యం ఏమిటి? త్రివిక్రమ్ కాంబోలో గతంలో వచ్చిన ‘జల్సా, అత్తారింటికి దారేది’ సినిమాలలో కూడా పవన్ అందంగానే కనిపించారు కానీ, వయసు పెరుగుతున్నా… ఆ వన్నె తగ్గకపోవడం వెనుక కారణమేంటో తాజాగా తెలియవచ్చింది. ‘మార్షల్ ఆర్ట్స్’లో నిపుణుడైన పవన్ సహజంగానే ఫిట్ నెస్ ప్రియుడే గానీ, ఇటీవల త్రివిక్రమ్ వలన ‘వైట్ రైస్’కు పూర్తిగా దూరమైనట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

వైట్ రైస్ భుజించడం కారణంగా ముఖం కాస్త ఉబ్బుతోందని భావించిన త్రివిక్రమ్, దానిని పూర్తిగా దూరం పెట్టాలని పవన్ కు సూచనలు చేసారని తెలుస్తోంది. కనీసం ఈ సినిమా షూటింగ్ జరిగే సమయం వరకైనా దూరంగా ఉండమని చెప్పడంతో, పవర్ స్టార్ దానినే ఫాలో అయిపోతున్నాడట. సాధారణంగా పవన్ తినేదే వైట్ రైస్, కూరగాయలు కాగా, ఇప్పుడు ఆ మెనూలో నుండి వైట్ రైస్ వెళ్లిపోయింది.

ADVERTISEMENT
Latest Stories