వంటేరు అంటే ఎందుకు తెరాస నాయకులకు అంత కలవరం?

KCR-Dolls-Out-More-Freebies-and-Schemes-in-TRS-Manifestoచంద్రబాబు నాయుడుపై గత నాలుగు పర్యాయాలు పోటీ చేస్తున్న వారి గురించి ఎవరికైనా తెలుసా? పోనీ వైఎస్ రాజశేఖర రెడ్డి పై పోటీ చేసిన వారి గురించి? రాజకీయాలను చాలా క్లోజ్ గా ఫాలో అయ్యే వారికి తప్ప ఎవరికీ తెలీదు. కారణం వారి ఓటమి ఖాయం ఓడిపోయే వారిని మీడియా గానీ చరిత్రగానీ పెద్దగా గుర్తించదు.

[m9ad]

ADVERTISEMENT

అయితే కేసీఆర్ మీద పోటీ చేసి ఓడిపోయిన వంటేరు ప్రతాప్ రెడ్డి మీద మాత్రం విపరీతంగా చర్చ జరుగుతుంది మీడియాలో. ప్రతాప్ రెడ్డి గెలవడం ఖాయమని కొందరు చెబుతుండగా, కేసీఆర్ ఏకంగా తన ట్రంప్ కార్డు అయినట్టు వంటి హరీష్ రావును గత కొద్దీ రోజులుగా గజ్వెల్ లోనే తిష్ట వేయించారు. రెండు రోజుల క్రితం కేసీఆర్‌ను గజ్వేల్‌లో ఓడించాలని మంత్రి హరీశ్‌రావు తనకు ఫోన్‌ చేసి కోరారని వంటేరు సంచలన వాఖ్యలు చేశారు

దీనిపై హరీశ్‌రావు మండిపడ్డారు. ఆధారాలు చూపకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వంటేరు వ్యాఖ్యలపై పై తెరాస నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం రజత్‌కుమార్‌ను కలిసి ఇటీవల మంత్రి హరీశ్‌రావుపై గజ్వేల్‌లో వంటేరు ప్రతాప్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా అందజేశారు. సహజంగా ముఖ్యమంత్రి పై పోటీ చేసే అభ్యర్థిని ఎవరు పట్టించుకోరు… కానీ వంటేరు అంటే ఎందుకు తెరాస నాయకులకు అంత కలవరం?

ADVERTISEMENT
Latest Stories