వచ్చే వారం తెరాస తుది జాబితా

TRS Final List On next week -- KCRతెలంగాణ రాష్ట్ర సమితి జాబితాలో మిగిలిన 14 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుకుంది. ఇంకో రెండు మూడు రోజులలో తుది జాబితాను ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించే అవకాశం ఉంది. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన నివాసం నుంచి స్వయంగా ఫోన్‌లో పలువురు ఆశావహులతో మాట్లాడారు.

ADVERTISEMENT

[m9ad]

“మీరో, మరొకరో.. అభ్యర్థులెవరైనా కావచ్చు. ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలి” అని వారికి సూచించినట్లు సమాచారం. వచ్చే నెల 3 నుంచి 8 వరకు జిల్లాలలో తెరాస ఎన్నికల బహిరంగ సభలు ప్లాన్ చేస్తున్నారు. వీటికి ముందే మిగిలిన అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది.

గతంలో ప్రకటించిన 105 అభ్యర్థుల జాబితాలో ముగ్గురు సిట్టింగులకు టిక్కెట్లు దక్కలేదు. ఈ జాబితాలో కూడా కొందరు సిట్టింగులకు సీట్లు ఇవ్వకపోవచ్చని సమాచారం. ఇప్పటికే కొందరికి ఈ విషయం తేల్చి చెప్పినట్టు సమాచారం. మరోవైపు ఎన్నికల షెడ్యూల్ కోసం పార్టీ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories