తెరాస ఎమ్మెల్యేపై తీవ్ర వ్యతిరేకత… కేసీఆర్ మీదే ఆశలన్నీ

TRS Go Back slogans - all hopes on KCRతెలంగాణాలో ఎన్నికల నగారా మోగింది. పట్టణాలు, గ్రామాల్లో హడావుడి మొదలైంది. వివిధ పార్టీల నేతలు, అభ్యర్థులు ప్రచారాలు ముమ్మరం చేయగా..కొందరు నేతలకు నిలదీతలు స్వాగతం పలుకుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో తెరాస ముందువరసలో ఉంది. ఇప్పటికే ఆ పార్టీ 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

[m9ad]

ADVERTISEMENT

అదే విధంగా వారు వారి నియోజకవర్గాలలో ఎక్కువ ప్రతిఘటన ఎదురుకుంటున్నారు. ఇప్పటికే అటువంటి సంఘటనలు 4-5 వెలుగులోకి రాగా తాజాగా వర్ధన్నపేటలో మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ ఎమ్మెల్యేగా నాలుగున్నరేళ్లలో మా ఊరుకు ఏంచేశారంటూ స్థానికులు ఆయనను అడ్డుకునే యత్నం చేశారు.

‘‘గోబ్యాక్‌.. గ్యోబాక్‌.. మీకు ఓటు అడిగే హక్కులేదు’’ అంటూ బ్యానర్‌ ప్రదర్శిస్తూ బాలాజీనగర్‌ వాసులు పెద్దసంఖ్యలో సభాస్థలికి వద్దకు ప్రదర్శనగా తరలివచ్చారు. దీనితో చేసేది ఏమీ లేక ఆయన అక్కడ నుండి నిష్కర్మించారు. ఇదే పరిస్థితి చాలా చోట్ల ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ మొహం చూసి వారికి ఓట్లు వేస్తారని, ప్రజలలో కేసిఆర్ కి ఉన్న ఇమేజ్ తో అందరూ గట్టెక్కుతారని అధికార పార్టీ నాయకులు అభిమానులు తమకు తాము ధైర్యం చెప్పుకుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories