ఈ విషయంలో కేటీఆర్ ఒక్కరే హీరో!

KTR TRS Telangana Real Estate Scamతెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడుగానే కాకుండా తెలంగాణా రాష్ట్ర మంత్రిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న కేటీఆర్, సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. ట్విట్టర్ వేదికగానే చాలా సమస్యలను పరిష్కరించిన కేటీఆర్, అదే ట్విట్టర్ వేదికగా నేడు ప్రముఖ సినీ సెలబ్రిటీలందరి నుండి జన్మదిన శుభాకాంక్షలు అందుకున్నారు. స్వతహాగా రాజకీయ నేపధ్యం నుండి వచ్చిన కేటీఆర్ కు సినీ ప్రముఖుల నుండి ఈ రేంజ్ లో స్పందన మాత్రం ఊహించని విషయమే.

ఇందులో ఆంతర్యం ఏమిటో గానీ, టాలీవుడ్ కు చెందిన సినీ ప్రముఖులు మధుర శ్రీధర్, సుధీర్ బాబు, దేవిశ్రీప్రసాద్, రకుల్ ప్రీత్ సింగ్, మెహ్రీన్, ప్రియదర్శి, రమణ గోగుల, లావణ్య త్రిపాఠి, మంచు లక్ష్మి, థమన్, షెంతిల్ కుమార్, అనిరుద్, శోభు యార్లగడ్డ, అక్కినేని అఖిల్, బ్రహ్మాజీ, ఈషా రబ్బా, మంచు విష్ణు, వెన్నెల కిషోర్, సమంత తదితరుల నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకున్నారు. సహజంగా తమ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులకు కూడా ఈ స్థాయిలో సినీ సెలబ్రిటీలు స్పందించరు.

ADVERTISEMENT

ఏదో పవన్ కళ్యాణ్, మహేష్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ వంటి అగ్ర హీరోల జన్మదినోత్సవాలకు మాత్రమే ఈ రేంజ్ హంగామా సోషల్ మీడియాలో చూడగలం. కానీ అందుకు విరుద్ధంగా టీఆర్ఎస్ యువనేత పుట్టినరోజును ప్రత్యేకంగా కొనియాడడం చెప్పుకోదగ్గ విషయమే. బహుశా రాజకీయ నేతల పుట్టినరోజులలో ఈ స్థాయిలో సెలబ్రిటీల నీరాజనాలు అందుకున్న మరో నేత లేరని చెప్పడంలో సందేహం లేదు. సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ కు అడ్డాగా ఉండడమే దీనికి ప్రధాన కారణంగా పేర్కొనవచ్చు.

ADVERTISEMENT
Latest Stories