సోషల్ మీడియాలో “ట్రోల్” అవుతోన్న తెలుగు అవార్డ్స్!

TSR TV9 Telugu Awards Trollsసంవత్సరానికి ఎంతమంది ‘ఉత్తమ నటులు’ ఉంటారు. నంది అవార్డ్స్ పరంగా అయితే రెండు… ఒకటి ఏడాది మొత్తానికి ఉత్తమ నటుడు కాగా, అదే ఏడాది కొత్తగా ఎవరైనా హీరో అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శిస్తే… ఉత్తమ డెబ్యూ హీరో క్రింద అవార్డులను ఇస్తారు. అయితే వాస్తవానికి పరిశీలనలో మాత్రం ఏడాదికి “ఉత్తమ నటుడు” అంటే ఒక్కరే ఉంటారు. ఇది ఎక్కడైనా చెల్లుబాటు అవుతుంది గానీ, తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి ఇచ్చే అవార్డులకు మాత్రం కాదని మరోసారి నిరూపించుకుంటున్నారు.

టీఏస్సార్ – టీవీ9 సంయుక్తంగా నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో 2015, 2016లకు గానూ అవార్డులను ప్రకటించారు. ఇందులో 2016 సంవత్సరానికి గానూ ‘బెస్ట్ హీరో’గా బాలకృష్ణ (డిక్టేటర్), ‘బెస్ట్ యాక్టర్’గా నాగార్జున (సోగ్గాడే చిన్నినాయనా), ‘స్పెషల్ జూరీ బెస్ట్ అవార్డ్’ రామ్ చరణ్ (ధృవ), ‘స్పెషల్ జూరీ అవార్డ్ ఫర్ పాపులర్ చాయిస్’ నాని (జెంటిల్మెన్) సినిమాలకు గానూ ఎంపిక చేసారు. ఇదే మాదిరి 2015వ సంవత్సరానికి కూడా వెంకటేష్, అల్లు అర్జున్ లను ఎంపిక చేసారు.

ADVERTISEMENT

ఇలా హీరోహీరోయిన్లకు గానూ వివిధ రకాల పేర్లు పెట్టి, అవార్డులను ఎంపిక చేయడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ అవార్డు ప్రకటనలను ఒక ఆట ఆడుకుంటున్నారు. తిక్కవరపు ఎవరికైతే అవార్డు ఇవ్వాలి అనుకుంటున్నారో, దానికి ఒక పేరు పెట్టేసి అవార్డు బహుకరించేస్తారని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే అవార్డులకు విలువ లేకుండా పోయిన తరుణంలో కొత్తగా ఇలా ఏడాదికి ముగ్గురు, నలుగురు హీరోలను ఎంపిక చేస్తే… దానికి విలువ ఉంటుందా? కాస్త ఆలోచించండి తిక్కవరపు గారు! కళాకారులను సత్కరించాలనుకోవడం అభినందించదగ్గ విషయమే గానీ, మరీ ఈ విధంగా అంటే… ఎలా..?!

ADVERTISEMENT
Latest Stories