రవి ప్రకాష్ తరువాతి ప్లాన్ అప్పుడే రెడీ అట

Forgery Case Registered on TV9 Ravi Prakashటీవీ9 ఛానల్ లో పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఫోర‍్జరీతో పాటు, నిధుల మళ్లింపుకు పాల్పడ్డారనే కారణంతో టీవీ9 కొత్త మానేజ్మెంట్ ఆయనకు ఉద్వాసన పలికింది. రవిప్రకాశ్‌ పాస్‌పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక గత రెండురోజులుగా అజ్ఞాతంలో ఉన్న ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. టీవీ చానల్ నిర్వహణ తమ ఇష్టారాజ్యంగా జరగాలన్న పంతంతో కొత్త యాజమాన్యం తనను అన్యాయంగా కేసులలో ఇరికించి బయటకు పంపిందని రవిప్రకాశ్‌ వాదన.

ఇది ఇలా ఉండగా టీవీ9 యాజమాన్యం రవిప్రకాష్ స్థానంలో కొత్త ఎడిటోరియల్ బోర్డును తీసుకుని వచ్చే ప్రయత్నాలలో ఉంది. మరోవైపు ఈ కేసుల నుండి త్వరలోనే బయటపడతా అని ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ లో ఒక కొత్త టీవీ ఛానల్ పెట్టబోతున్నట్టు రవిప్రకాష్ తన సన్నిహితుల వద్ద చెప్పినట్టు సమాచారం. తనను మోసం చేసిన టీవీ9 యాజమాన్యం మీద లీగల్ గా వెళ్తూనే మరొపక్కన కొత్త ఛానల్ పెట్టి ఆ ఛానల్ కు బుద్ది చెప్పాలని ఆయన కృత నిశ్చయంతో ఉన్నారట.

ADVERTISEMENT

రవిప్రకాష్ తో పాటు కలిసి నడవడానికి టీవీ9 లోని చాలా మంది ఎంప్లాయిస్ రెడీ గా ఉన్నట్టు సమాచారం. తెలుగులో మొట్టమొదటి 24 గంటల న్యూస్ ఛానల్ టీవీ9. ఆ ఛానల్ రాకతో వార్తల స్వరూపమే మారిపోయింది. పుట్టగొడుల మాదిరి అనేక ఛానెళ్లు పుట్టుకువచ్చినా టీవీ9 అప్పటికీ ఇప్పటికీ నెంబర్ వన్ గానే ఉంది. అయితే రవిప్రకాష్ భయరకు వెళ్లడంతో అది ఏమైనా మారుతుందా అనేది చూడాలి. ఇప్పటికే వరకూ టీవీ9 కంటెంట్ బాధ్యత పూర్తిగా రవి ప్రకాశ్ కే అప్పగించినట్టు సమాచారం.

ADVERTISEMENT
Latest Stories