అగ్రిగోల్డ్ కేసులో ‘ట్విస్ట్!’ బాల్ ‘సీబీఐ’ కోర్టులో..!

Twist In Agri Gold Caseఎందరో సామాన్యుల ఆక్రందనలకు కారణమైన అగ్రిగోల్ద్ ఉదంతంలో… ఆ సంస్థ వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్ట్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అగ్రిగోల్డ్ కొనుగోలు చేసిన ఆస్తులను అమ్మి బాధితులకు న్యాయం చేయాలని తాము భావిస్తుంటే… ఆస్తుల వేలానికి గాని, విక్రయానికి గాని అగ్రిగోల్డ్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేయడం లేదని హైకోర్టు తీవ్రంగా స్పందించి, కేసును తప్పుద్రోవ పట్టించాలని చూస్తే చర్యలు మరింత కఠినతరంగా ఉంటాయని హెచ్చరించింది.

సంస్థ తీరుతో పాటు సీఐడీ అధికారుల దర్యాప్తుపై హైకోర్ట్ మండిపడింది. అగ్రిగోల్ద్ యాజమాన్యంపై సరైన చర్యలు తీసుకోవడంలో సీఐడీ అధికారులు మెతక వైఖరిని అవలంబిస్తున్నారని, దీంతో డిపాజిటర్ల సంక్షేమం రీత్యా ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 12వ తేదీకి హైకోర్ట్ వాయిదా వేసింది.

ADVERTISEMENT

నిజానికి గతేడాది అక్టోబర్ లోనే అగ్రిగోల్ద్ ఆస్తులను అమ్మి తొలి విడతగా ప్రజలకు కొంత సొమ్ములను చెల్లించాలని హైకోర్ట్ భావించింది. అయితే సీఐడీ దర్యాప్తు రీత్యా రానూ రానూ ఈ కేసులో జరుగుతున్న తాత్సారం పట్ల ఆగ్రహం వ్యక్తపరిచిన హైకోర్ట్ చివరికి సీబీఐకి అప్పగించడంతో… తమ డబ్బులు రావడానికి ఇంకెంత కాలం పడుతుందోనన్న ఆందోళన బాధితుల్లో వ్యక్తమవుతోంది.

ADVERTISEMENT
Latest Stories