‘జగన్’కు మరో ఇద్దరు ‘గుడ్ బై?’

potula-ramaraoప్రకాశం జిల్లాకు చెందిన వైఎస్సార్సీపి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావులు టీడీపీ తీర్థం తీసుకోనున్నట్లు సమాచారం. వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ దాఖలు చేసిన కార్యక్రమంలో కూడా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు పాల్గొనకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. స్వయంగా విజయసాయిరెడ్డి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి తన నామినేషన్ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానం పలికినప్పటికీ ఈ ఇద్దరూ వెళ్లకపోవడంతో ‘జంపింగ్’ అనేది దాదాపు ఖరారైంది.

ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో మంతనాలు జరిపారని, ఆ తర్వాత గిద్దలూరు, రాచర్ల మండల పరిషత్ అధ్యక్షులు, ఇతర ప్రజా ప్రతినిధులతో కూడా చర్చలు జరిపినట్లుగా సమాచారం. మిగిలిన మండలాల ప్రజలు, ప్రజాప్రతినిధులతో కలిసిన తర్వాత తాను టీడీపీ లో చేరనున్న విషయాన్ని అశోక్ రెడ్డి అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మరో ఎమ్మెల్యే పోతుల రామారావు తన స్వగ్రామమైన టంగుటూరులో కుటుంబ సభ్యులు, పలువురు పెద్దలతో మాట్లాడారని, అలాగే తన అనుచరులతో, వర్గీయులతో తాను పార్టీ మారనున్న విషయాన్ని చర్చించారని, తెలుస్తోంది.

ADVERTISEMENT

తెలుగుదేశం మహానాడు కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు విజయవాడలో సీఎం సమక్షంలోనే టీడీపీలో చేరే అవకాశముందని పొలిటికల్ వర్గాల టాక్. ఈ ఇద్దరి ఎమ్మెల్యేల వ్యవహారం వైసీపీ అధినేత చెవిన పడినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేదని, ఈ ఇరువురు ఎమ్మెల్యేలు జగన్ కు ‘గుడ్ బై’ చెప్పడం దాదాపుగా ఖరారైన విషయంగా తెలుస్తోంది. ఇప్పటికే 17 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడగా, మరికొద్ది రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే సూచనలు స్పష్టంగా కనపడుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories