అండర్ 19 వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. వెస్టీండీస్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం 145 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. పిచ్ బౌలింగ్ కు సహకరించడంతో విండీస్ బౌలర్లు చెలరేగిపోయారు. దీంతో భారత బ్యాట్స్ మెన్లు పెవిలియన్ కు క్యూ కట్టారు.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ బ్యాట్స్ మెన్లు కూడా తొలుత తడబడ్డారు. అయితే తర్వాత కుదురుకుని సగం స్కోర్ ను కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి సాధించారు. ఒక, విండీస్ దే విజయం ఖాయం అనుకున్న తరుణంలో వరుసగా 3 వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.
ఈ సమయంలో భారత బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇరు జట్లు విజయం కోసం శ్రమించాయి. అయితే స్పిన్నర్ దగర్ బౌలింగ్ లో వచ్చిన రెండు క్యాచ్ లను జారవిడచడంతో, విండీస్ బ్యాట్స్ మెన్లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తతో బ్యాటింగ్ చేసారు. అయితే భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ తో 49.3 ఓవర్ల వరకు మ్యాచ్ కొనసాగింది. వికెట్ల దూకుడుకు అడ్డుపడ్డ కార్టీకి (52 నాటౌట్) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.



