కృష్ణానదిలో అంతర్గత రవాణా మార్గాన్ని నిర్మించాలన్న ప్రతిపాదనలు సింగపూర్ అందించిన తుది ‘మాస్టర్ ప్లాన్’లో రూపొందించారు. నిజానికి ఈ ఆలోచనకు అంకురార్పణ చేసింది చంద్రబాబే. మదిలో మెదిలిన ఆలోచనను సింగపూర్ బృందానికి తెలియజేయడంతో… ముందుగా ఇచ్చిన ‘ప్లాన్’లో మార్పులు చేసి సొరంగ మార్గాన్ని ప్రతిపాదించింది. ప్రస్తుతం ఊహలలో తేలియాడుతున్న ఈ రవాణా మార్గం, కార్యరూపం దాలిస్తే ఎలా ఉంటుంది అని కలగడం సహజమే! దానికి ప్రతిరూపమే ఈ ఫోటో.
లైట్ల నడుమ రహదారిలో వాహనాలు వెళ్తుంటే… అటు, ఇటు జలచర సుందర దృశ్యాలు కనువిందు చేస్తుంటే… ఊహించుకోవడానికి అద్భుతంగా ఉంది కదూ! ఆ అద్భుతాన్నే ఫోటో రూపంలో పెడితే అదిరిపోయిందనే టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
రాష్ట్ర ప్రజలకు అపూర్వమైన థ్రిల్ ను కలిగించేందుకు ఓ అడుగు ముందుకేసిన ప్రభుత్వం కేంద్రానికి సంబంధిత ప్రతిపాదనలు పంపింది. కేంద్రం గనుక ఆమోద ముద్ర వేస్తే, రాష్ట ప్రజలకు పండగే! అమరావతి నుండి విజయవాడ వరకు దాదాపు 3 కిలో మీటర్ల పాటు ఈ సుందర దృశ్యాలు కనువిందు చేస్తాయి.





