అఫిషియల్ – ఉగాది రోజు వచ్చేస్తున్నాడు!

Ungarala Rambabu Movie Teaser on Ugadhiజీవితంలో అన్ని రుచులను అందించేదిగా తెలిపే తొలి తెలుగు పండగ ఉగాది పర్వదినం పురస్కరించుకుని, తెలుగు సినీ అభిమానులను అలరించడానికి సునీల్ తన కొత్త సినిమా టీజర్ తో వచ్చేస్తున్నాడు. “ఉంగరాల రాంబాబు” పేరుతో ప్రముఖ దర్శకుడు క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై సునీల్ భారీ అంచనాలే పెట్టుకున్నాడు. ఇటీవల కాలంలో వరుస ఫెయిల్యూర్స్ చవిచూస్తున్న సునీల్ కెరీర్ కు ఈ సినిమా సక్సెస్ చాలా కీలకమనే చెప్పాలి.

ADVERTISEMENT

అందుకే ‘ఓనమాలు, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ వంటి వినూత్నమైన సినిమాలను తెరకెక్కించిన క్రాంతి మాధవ్ సినిమాకు ఓకే చెప్పారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కు వీక్షకుల నుండి మంచి స్పందనే రావడంతో, ఉగాది నాడు రాబోతున్న టీజర్ తో కూడా పాస్ మార్కులు పొందితే… ‘ఉంగరాల రాంబాబు’ను ప్రేక్షకులకు దగ్గరికి చేర్చినట్లే భావించవచ్చు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమాను పరుచూరి కిరీటీ నిర్మిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories