సూర్య “24” సంగతులు… మిగతావన్నీ ధియేటర్లోనే..!

24-hrs-before-suriya-24-movie-reveals-more‘మనం’ దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన “24” సినిమా మరికొద్ది గంటల్లో ధియేటర్లలో ప్రత్యక్షమవనుంది. మూడు విభిన్న పాత్రలు పోషించిన సూర్య నటన ప్రధాన హైలైట్ గా నిలిచిన ఈ సినిమా ప్రత్యేక షోలు చూసిన వారు ఇప్పటికే ‘24’ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కాన్సెప్ట్ బేస్ సినిమాలను అద్భుతంగా తెరకెక్కిస్తున్న విక్రమ్ ప్రతిభకు నిదర్శనంగా కొనియాడుతున్న “24” సినిమాలోని కొన్ని సంగతులు వీక్షకుల కోసం…

కవల పిల్లలుగా ఆత్రేయ (డాన్ పాత్ర), శేతురామన్ (సైంటిస్ట్ పాత్ర)గా రెండు పాత్రలు పోషిస్తున్న సూర్య… తన సోదరుడు శేతురామన్ ప్రత్యేకంగా తయారుచేసిన ఓ వాచ్ కోసం తలపడగా, తను చనిపోయే ముందు ఆ వాచ్ ను తన కొడుకు మణికి ఇవ్వడంతో… సినిమా కధ ‘ఆత్రేయ వర్సెస్ మణి’ మాదిరిగా మారుతుంది.

ADVERTISEMENT

ఇక, హీరోయిన్లుగా నటించిన సమంత, నిత్యామీనన్ పాత్రలు కూడా చర్చనీయాంశమయ్యాయి. అభినయంలో వర్తమాన హీరోయిన్ల కంటే ఒక మెట్టు పైన ఉండే నిత్యామీనన్ కేవలం 20 నిముషాల పాత్రలో కనపడుతుండగా, సమంత మాత్రం ఫుల్ లెంగ్త్ రోల్ లో దర్శనమివ్వనుంది. దీంతో సిల్వర్ స్క్రీన్ పై ఈ ఇద్దరు భామలలో ఎవరు ఎక్కువగా ఆకట్టుకుంటారో అన్న అంశం ఆసక్తిగా మారింది. మిగతా సంగతులు కూడా చెప్పేస్తే… సినిమా చూసేటపుడు ఫీల్ ఉండదు గనుక… మిగతావన్నీ ధియేటర్లోనే..!

ADVERTISEMENT
Latest Stories