Telugu

అమెరికా-ఇరాన్‌ యుద్ధంలో మరో బ్రేక్?

అమెరికా-ఇరాన్‌ యుద్ధం మొదలై 5 నెలలు పూర్తయి 6వ నెలలోకి ప్రవేశించాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ఇరాన్‌ శక్తి సామర్ధ్యాలను చాలా తక్కువ అంచనా వేసి యుద్ధం మొదలుపెట్టి ఇప్పుడు దానిలో చిక్కుకుపోయారు.

అమెరికా చేస్తన్న దాడులతో ఇరాన్‌ కూడా తీవ్రంగా నష్టపోతూనే ఉంది. కనుక రెండు దేశాలు యుద్ధం కొనసాగించలేక, వెనక్కు తగ్గలేక ఇబ్బంది పడుతున్నాయి.

ADVERTISEMENT

కనుక శాంతి చర్చలు, ఒప్పందంతో యుద్ధం నిలిచిపోతుందని అందరూ భావిస్తే, యుద్ధంతో అలిసిన రెండు దేశాలు మధ్యలో బ్రేక్ కోసమే ఆ పేరుతో కాస్త టైమ్‌ తీసుకున్నాయని తర్వాత అవే నిరూపించాయి.

కనుక మళ్ళీ నెలరోజులుగా హోరాహోరీ యుద్ధం తర్వాత మరోసారి బ్రేక్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్లున్నాయి.

ట్రంప్‌ ఏమన్నారంటే,, “ఇరాన్‌ పూర్తిగా చేతులెత్తేసింది. మాపై దాడులు చేయవద్దు. మేము భరించలేకపోతున్నామని మమ్మల్ని వేడుకుంటోంది. మా షరతులన్నిటికీ అంగీకరిస్తామని, శాంతి ఒప్పందం ప్రకారం నడుచుకోవడానికి కాస్త సమయం ఇమ్మనమని వేడుకుంటోంది.

గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్‌ మీద దాడులు నిలిపివేయాలని కోరుతున్నాయి. ఇజ్రాయెల్‌ కూడా యుద్ధ విరమణకు అంగీకరించింది. ఇరాన్‌కి మరో అవకాశం ఇస్తున్నాను. వీలైనంత త్వరగా ఒప్పందంలో అంశాలను అమలుచేయాలి. లేకుంటే ఇరాన్‌పై మళ్ళీ దాడులు తప్పవు,” అని ట్రంప్‌ హెచ్చరించారు.

అయితే ఇరాన్‌ శనివారం చేసిన తాజా ప్రకటనలో “మా దేశంపై మళ్ళీ ఎలాంటి దాడి జరిగినా ఈసారి మరింత తీవ్రస్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని,” హెచ్చరించింది.

ఇరాన్‌ హెచ్చరికలతో అప్రమత్తమైన అమెరికా ప్రభుత్వం పశ్చిమాసియా దేశాలలో భీకర దాడులు జరిగే అవకాశం ఉంది కనుక ఆయా దేశాలలో ఉన్న అమెరికన్లు తక్షణం అక్కడి నుంచి బయటపడితే మంచిదని తమ పౌరులకు సూచించింది. అలాగే పస్చిమాదేశాలకు వెళ్ళాలనుకుంటున్న అమెరికన్లు కూడా పునరాలోచించుకోవాలని హితవు పలికింది.

కనుక తుపాకులు గురిపెట్టుకొని అమెరికా-ఇరాన్‌ జరుపుతున్న ఈ శాంతి చర్చలు కేవలం యుద్ధంలో బ్రేక్ కోసమే తప్ప రెండు దేశాలకు చిత్తశుద్ధి లేదనిపిస్తుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Box Office: A Disaster Weekend @ Tollywood

The Telugu box office is usually explosive in nature when there is an interesting film…

20 minutes ago

రెడ్డి గారి మద్దతుతో బీసీ-సీఎం…అసందర్భమమైన ప్రకటనా.?

తెలంగాణ కాంగ్రెస్ నాయకుల తీరు చూస్తే కూర్చున్న కొమ్మనే నరుక్కునే రీతిలో కనిపిస్తుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ తెలంగాణలో…

29 minutes ago