
అయితే ‘రక్తచరిత్ర’ రేంజ్ లో ‘వంగవీటి’ లేదన్నది ప్రేక్షకుల తొలి మాట. సినిమా టెంపోను తగ్గించే పాటలు, చాలా స్లోగా నడిచే కధనం, వర్మ ఇచ్చే వాయిస్ ఓవర్, బోరింగ్ సన్నివేశాల నడుమ… అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఎలివేట్ చేసే మర్డర్లు సినిమాలో హైలైట్ గా నిలిచాయన్నది ఫస్ట్ టాక్. వంగవీటి రాధ పాత్రను బాగా చిత్రీకరించారని, అలాగే సెకండాఫ్ లో వచ్చే ‘వంగవీటి’ టైటిల్ సాంగ్, వంగవీటి మోహనరంగా ఎమ్మెల్యే అయిన తర్వాత సన్నివేశాన్ని వర్మ బాగా చిత్రీకరించారని టాక్.
అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే దేవినేని మురళీ మర్డర్ సన్నివేశం సినిమాకే హైలైట్ గా నిలిచిందని చెప్తున్నప్పటికీ, ఓవరాల్ గా ఆశించిన ‘టాక్’ను అయితే ‘వంగవీటి’ సొంతం చేసుకోలేకపోయింది. అయితే గత రెండు, మూడు సంవత్సరాలుగా వర్మ ‘చిత్రవిచిత్రమైన’ సినిమాలను చూస్తున్న వారికి మాత్రం, కాస్తంత రిలీఫ్ ఇచ్చే విధంగా సినిమాను తెరకెక్కించారని సమాచారం. ప్రేక్షకుల నుండి భిన్న స్పందనలు తెచ్చుకున్న ఈ సినిమా ‘ఫైనల్ టాక్’ ఏంటో తెలియాలంటే మాత్రం మొదటి మూడు రోజులు గడవాల్సిందే!
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పాతబస్తీకి పరిమితమైన మజ్లీస్ పార్టీ సహాయసహకారాలు తప్పనిసరి. కనుక మజ్లీస్ అధినేత అసదుద్దీన్…
Becoming a director in the film industry is one thing. Getting someone to trust you…