‘మెగాహీరో’ మెచ్చిన ‘యువహీరో’ టీజర్!

Varun-Tej-impress with kesava trailerత్వరలో “మిస్టర్” ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న మెగా హీరో వరుణ్ తేజ్ కు ఓ టీజర్ విపరీతంగా నచ్చేసింది. ఆ మాటకొస్తే ఒక్క వరుణ్ తేజ్ కే కాదు, చూసిన ప్రతి ఒక్కరిని ఆ టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఫస్ట్ లుక్ లోనే పడేసిన నిఖిల్ “కేశవ” టీజర్ గురించే ఇదంతా! ‘చాలా ఇంటెన్స్ గా కిక్ యాస్ టీజర్ ఇదంటూ పొగడ్తలతో ముంచెత్తిన’ వరుణ్ తేజ్ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ టీజర్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కొత్తదనంతో కూడిన సినిమాలు చేస్తూ వరుస సక్సెస్ లు అందుకుంటున్న నిఖిల్ కు సినీ ప్రేమికులు నీరాజనాలు పలుకుతున్నారు. ముఖ్యంగా వారసత్వం రాజ్యమేలే సినీ పరిశ్రమలో నిఖిల్ లాంటి హీరోల ఎదుగుదల, ప్రతి ఒక్కరికి స్పూర్తినిచ్చే అంశంగా మారింది. ఈ టీజర్ ఈ నెల 24న విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్ “కాటమరాయుడు”తో పాటు ధియేటర్లలో ప్రదర్శితం కానుంది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories