శ్రీనువైట్లకు తాజాగా బుక్కైన “మెగా హీరో” ఎవరు?

srinu vaitla‘దూకుడు’ సినిమా తర్వాత టాలీవుడ్ హాట్ అండ్ క్రేజీ డైరెక్టర్లలో ఒకరిగా అవతరించిన శ్రీను వైట్ల ఇమేజ్ “ఆగడు” సినిమాతో మసకబారింది. ఇక, దానిని పాతాళంలోకి తీసుకెళ్ళిన సినిమాగా రామ్ చరణ్ “బ్రూస్ లీ” నిలిచింది. దీంతో శ్రీనువైట్లతో సినిమా అంటే… ఆ హీరో అడ్డంగా బుక్కైపోయినట్లే అన్న కామెంట్స్… సక్సెస్ ను ప్రామాణికంగా చేసుకునే సినీ వర్గాల నుండి వ్యక్తమయ్యాయి. ఆ కారణంతోనే ‘శ్రీనువైట్ల చేతిలో చెర్రీ అడ్డంగా బుక్కయ్యాడు’ అన్న కామెంట్స్ వినపడ్డాయి.

ADVERTISEMENT

అయితే శ్రీనువైట్ల సినిమాలకంటూ ఓ సపరేట్ స్టైల్ ఉంటుంది. కామెడీని సృష్టించడంలో త్రివిక్రమ్ వంటి టాలెంటెడ్ దర్శకులు కూడా శ్రీనువైట్ల కామెడీనే ఫాలో అవుతున్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి శ్రీనువైట్ల మరోసారి మెగా హీరోతో జత కట్టబోతున్నారన్న వార్తలు ట్రేడ్ వర్గాల్లో హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటివరకు మూడు సినిమాలు ‘ముకుంద, కంచె, లోఫర్’ చిత్రాలు చేసినా, రావాల్సిన కమర్షియల్ బ్రేక్ రాకపోవడంతో, వరుణ్ తేజ్ ఈ సారి శ్రీను వైట్లతో జత కట్టబోతున్నారనే సమాచారం బయటకు వచ్చింది.

దీనికి సంబంధించి ప్రస్తుతం కధా చర్చలు జరుతున్నాయని, వరుణ్ తేజ్ ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పేసారని, ప్లాప్ లతో సతమతమవుతున్న శ్రీనువైట్ల – వరుణ్ తేజ్ లు ఇద్దరూ కలిసి ఏం చేయబోతున్నారో గానీ, ఈ కాంభినేషన్ కార్యరూపం దాలిస్తే, శ్రీను వైట్లకు మాత్రం ఈ సినిమా అగ్ని పరీక్ష కాబోతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. శ్రీనువైట్లకు మళ్ళీ పునర్వైభవం దక్కాలంటే మరో మంచి అవకాశంగా కూడా భావించవచ్చు. మరోవైపు వరుసగా డిఫరెంట్ సినిమాలు చేస్తున్న వరుణ్ తేజ్ కు కమర్షియల్ బ్రేక్ లభించవచ్చని అంచనా వేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories