కాపులను రెచ్చగొట్టేందుకు వంగవీటి రంగా హత్య ఉదంతాన్ని వాడుకుంటూ వ్యాఖ్యలు చేస్తున్న జగన్ కు, తిరిగి అవి ‘బూంరాంగ్’ అయ్యే పరిస్థితి నెలకొంటోంది. కాపు ఐక్యగర్జన సమయంలో కూడా రంగా హత్య ఉదంతాన్ని ప్రస్తావిస్తూ కోడెల శివప్రసాద్, దేవినేని ఉమా, వెలగపూడి రామకృష్ణబాబు తదితరులపై తీవ్ర ఆరోపణలు చేసిన జగన్ కు తిరిగి అవే వ్యాఖ్యలు మెడకు చుట్టుకునేలా కనపడుతున్నాయి.
ఇప్పటికే స్పీకర్ కోడెల, దేవినేని ఉమా తీవ్రస్థాయిలో మండిపడుతూ వ్యాఖ్యలు చేయగా, మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి అయితే ఏకంగా జగన్ ను శాసనసభ నుండి రద్దు చేయాలని కోరారు. ఇక, తాజాగా స్పందించిన వెలగపూడి రామకృష్ణబాబు అయితే జగన్ జగన్ పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. “వంగవీటి రంగా హత్య ఉదంతంలో కోర్టు తనకు క్లీన్ చీట్ ఇచ్చిందని, అయినప్పటికీ జగన్ ప్రస్తావించడం దిగజారుడుతనానికి నిదర్శమని, జగన్ పై పరువు నష్టం దావా వేస్తానని” తీవ్రంగా స్పందించారు.
తెలిసి తెలియని విమర్శలు, ఆరోపణలు చేస్తూ జగన్ తనకు తానూగా ప్రత్యర్ధి వర్గాలకు అవకాశం కల్పిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సున్నితమైన సమయంలో ఉద్వేగపరిచే అంశాలను ప్రధాన నాయకులు ప్రస్తావించడం అనేది వారి పరిపక్వతను ప్రజలకు చాటి చెప్తోందని… మరి ఈ విషయంలో జగన్ ఏ స్థాయిలో ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు అన్న మాటలు వినపడుతున్నాయి.





