
జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిలు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ తెర వెనుక ఏవిదంగాఅందరి కాళ్ళు పట్టుకుంటారో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎడిటర్ వేమూరి రాధాకృష్ణ బయటపెట్టేశారు.
“ఈరోజు ఆంధ్రజ్యోతి బ్రేక్ ఫాస్ట్ న్యూస్‌లో గుడిని మింగేది సుబ్బారెడ్డి, లింగాన్ని మింగేది సాయిరెడ్డి. భూమిని మింగిన రాక్షసులు, అంటూ వాస్తవాలు చెప్పినందుకు విజయసాయి రెడ్డికి కోపం కలగడం సహజం. దాంతో ఆయన వేమూరి రాధాకృష్ణపై వరుస ట్వీట్లు వేసి తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. దానికి వేమూరి రాధాకృష్ణ కూడా అంతకంటే చాలా ఘాటుగా “నీచ నికృష్ట విజయసాయి… అంటూ పెద్ద జవాబే ఇచ్చారు. దానిలో ఆయన జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డిల తెర వెనుక భాగోతాలన్నీ బయటపెట్టేశారు.
జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకు అనుకూలంగా ఉండాలని కోరారని, అందుకు ఎన్ని కోట్లు కావాలన్నా ఇస్తానన్నారనే విషయం వేమూరి రాధాకృష్ణ బయటపెట్టేశారు. కానీ తాను ఆఫర్ స్వీకరించకపోవడం వల్లనే ఆంధ్రజ్యోతిపై ఎల్లో మీడియా ముద్రవేసి దెబ్బతీయాలని విశ్వప్రయత్నాలు చేశారని కానీ ఫలించలేదన్నారు. తాను రాజకీయ నాయకులను బ్లాక్ మెయిల్ చేసేవాడినే అయితే ఆనాడు తాను జగన్ ఆఫర్ చేసిన కోట్ల రూపాయలు తీసుకొని హాయిగా ఉండేవాడినే కదా? కానీ కాదని కష్టాలు, ఆర్ధిక సమస్యలు అనుభవించిన సంగతి విజయసాయి రెడ్డికి తెలియదా? అని వేమూరి రాధాకృష్ణ ప్రశ్నించారు.
నెల రోజుల క్రితం విజయసాయి రెడ్డి తన వద్దకు జగన్ తరపున రాయబారం చేయడానికి వచ్చారనే విషయం వేమూరి రాధాకృష్ణ ఇప్పుడు బయటపెట్టేశారు. వైసీపి ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత విజయసాయి రెడ్డి అనేకసార్లు రహస్యంగా వచ్చి తనని కలిశారనే విషయం వేమూరి రాధాకృష్ణ బయటపెట్టేశారు.
ట్విట్టర్‌లో నన్ను తిడుతూ రహస్యంగా వచ్చి నన్ను కలిసి కాళ్ళు పట్టుకోవడం నీకు అలవాటే కదా ఏ-2 విజయసాయి రెడ్డి అంటూ దుమ్ము దులిపేశారు. నువ్వు నా వద్దకు వచ్చావు కానీ ఏనాడైనా నేను మీ దగ్గరకు వచ్చానా?అని వేమూరి రాధాకృష్ణ ప్రశ్నించారు.
జగన్ నన్ను పట్టించుకోవడం లేదంటూ ఢిల్లీలో కలిసిన వారందరికీ చెప్పుకొని నువ్వు ఏడుస్తున్నప్పుడు, ఓ కేంద్రమంత్రి ‘ఎంపీలను మీ పార్టీలో చేర్చుతానంటూ రాజకీయ వ్యభిచారం చేసే నిన్ను నమ్మలేము,” అని నీ మొహం మీదే అన్న మాట నిజమా కాదా? చెప్పు నీచ నికృష్ట విజయసాయి రెడ్డి? అని వేమూరి రాధాకృష్ణ ప్రశ్నించారు.
నా పత్రిక, నా ఎదుగుదల గురించి తెలుగు రాష్ట్రాల వెలుపల బహిరంగ చర్చకు రమ్మనని నువ్వు విసిరిన సవాలుని స్వీకరిస్తున్నాను. ఢిల్లీలో మీ సాక్షి ఛానల్ సమక్షంలోనే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్దం ఉండు నీచ నికృష్ట విజయసాయి రెడ్డీ…,” అంటూ వేమూరి రాధాకృష్ణ ప్రతి సవాలు విసిరారు.
ఆస్తుల పంపకాలలో విజయమ్మ, షర్మిల జగన్మోహన్ రెడ్డి బండారాన్ని బయటపెడితే, జగన్, విజయసాయిల తెర వెనుక భాగోతాలను వేమూరి రాధాకృష్ణ బయటపెడుతున్నారు. విజయసాయి రెడ్డితో బహిరంగ చర్చలో పాల్గొనే ధైర్యం వేమూరి రాధాకృష్ణకి ఉందని స్పష్టమైంది.
కానీ ఆయనని ఎదుర్కొనే ధైర్యం విజయసాయి రెడ్డికి ఉంటుందని అనుకోలేము. ఒకవేళ ఆయనతో చర్చలో పాల్గొంటే ఇంతవరకు విజయసాయి రెడ్డి గురించి ఎవరికీ తెలియని అనేక రహస్యాలు బయటపడే ప్రమాదం ఉంటుంది. కనుక విజయసాయి రెడ్డి కూడా జగన్‌లాగే ఏదో కుంటిసాకుతో మొహం చాటేయక మానరు.
Kamiya Jani has been a popular face on social media for her way of interacting…
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…