అందరికీ మేడే నే కావాలంటే ఎలా?

Venkatesh Narappa-సంక్రాంతి సందడి ముగిసింది. ఫిబ్రవరి నుండి మే వరకూ వరుసగా చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలు వరుసకట్టబోతున్నాయి. రెండు డోజన్లకు పైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరో వైపు ఉన్నఫళంగా మేడే రిలీజ్ కోసం డిమాండ్ బాగా పెరిగింది. ముందుగా రెండు నెలల ముందే సాయి ధరమ్ తేజ్ తన సోలో బ్రతుకే సో బెటరు సినిమా మే 1న విడుదల అవుతుందని ప్రకటించాడు.

ADVERTISEMENT

అయితే ఇప్పుడు వెంకటేష్ నటిస్తున్న నారప్ప (తమిళ్ హిట్ ఫిలిం అసురన్ రీమేక్) కూడా అదే తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. తాజాగా అఖిల్ అక్కినేని నటిస్తున్న కొత్త చిత్రం కూడా అదే రోజు విడుదలకు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

మేడే లేబర్ హాలిడే కావడం అది శుక్రవారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చినట్టు, దానితో ఈ డేట్ కు క్రేజ్ వచ్చింది. అయితే రెండు మూడు సినిమాలు పోటీ పడే అవకాశం అయితే లేదు. మరి చివరిగా ఏ సినిమా విడుదల అవుతుందో చూడాల్సి ఉంది.

ముందు ప్రకటించిన సాయి ధరమ్ తేజ్ కు అవకాశం దక్కుతుందో లేదో. అయితే అఖిల్ గానీ వెంకటేష్ గానీ రావడం ఖాయమైతే సాయి ధరమ్ తేజ్ తప్పుకోవాల్సిందే. వెంకటేష్ వెనుక సురేష్ బాబు, అఖిల్ సినిమా వెనుక గీత ఆర్ట్స్ ఉండడంతో వేరే ఆప్షన్ ఉండదు. చూడాలి ఏం జరగబోతుంది అనేది.

ADVERTISEMENT
Latest Stories