‘విక్టరీ’ గురించి ఊదరగొట్టారు… అంత లేదే..!

Venkatesh presents Bigg Boss 2 Telugu title to kaushalనాచురల్ స్టార్ నాని హోస్ట్ చేసిన ‘బిగ్ బాస్ 2’ సీజన్ ముగిసింది. ఫైనల్లో కౌషల్ ని విజేతగా ప్రకటించారు, అలాగే గెలిచిన మొత్తాన్ని కాన్సర్ బాధితులకు వినియోగిస్తానని చెప్పి, అందరి మనసులు గెలుచుకున్నాడు కౌషల్. నిజానికి ఈ విజేత పేరు ముందుగా అంచనాలు వేసినదే. ఎందుకంటే సోషల్ మీడియాలో ‘కౌషల్ ఆర్మీ’ పేరుతో జరిగిన రచ్చ తెలియనిది కాదు.

[m9ad]

ADVERTISEMENT

కనుక ‘బిగ్ బాస్ 2’ విజేత పేరులో ట్విస్ట్ లు ఏమి లేవు గానీ, ఈ ఫైనల్ కోసం విక్టరీ వెంకటేష్ ప్రత్యేక అతిధిగా విచ్చేసారని, ఈ ఫైనల్లో నానిని మించిపోయి విక్టరీ అదరగొట్టేసారని విస్తృతంగా ప్రచారం జరిగింది. కానీ అందులో ఇసుమంత వాస్తవం కూడా లేదన్న విషయం తేటతెల్లమైంది. విక్టరీ విచ్చేసిన వార్త నిజమే గానీ, అందులో సెంటరాఫ్ అట్రాక్షన్ గా అయితే నిలువలేదు.

ఫైనల్ కోసం ఎవరో ఒకరిని తెప్పించాలని వెంకటేష్ ను రప్పించినట్లుగా కనపడింది తప్ప, అందులో విక్టరీ మార్క్ ఏ మాత్రం లేదు. వెంకీ సంగతి పక్కన పెడితే, ఫైనల్ ఎపిసోడ్ లో నాని కూడా విఫలమయ్యారనే చెప్పవచ్చు. బహుశా ఒత్తిడి ఎక్కువగా ఉందో ఏమో గానీ, ఎక్కువ వినోదం పండించే ప్రయత్నంలో తన ‘నాచురల్’ మార్క్ కు దూరంగా నాని జరిగిన వైనం బుల్లితెరపై స్పష్టంగా కనపడింది.

ADVERTISEMENT
Latest Stories