విక్టరీ వెంకటేష్ మరియు యువ సామ్రాట్ నాగ చైతన్య యొక్క మల్టీస్టారర్ చిత్రం వెంకీ మామ బాక్స్ ఆఫీసు వద్ద యావరేజ్ వెంచర్ గా అయ్యింది. ఈ చిత్రం టెలివిజన్‌లో కూడా అదే రకమైన ప్రదర్శనను ఇచ్చింది. జెమిని టీవీలో ఇటీవల జరిగిన వరల్డ్‌వైడ్ టీవీ ప్రీమియర్‌లో ఈ చిత్రం 9.8 టీవీఆర్ రేటింగ్ ని పొందింది.
వెంకటేష్ కు కుటుంబ ప్రేక్షకులలో ఉన్న ఫాలోయింగ్, సినిమా యొక్క జోనర్ బట్టి తక్కువే అనుకోవచ్చు. అంతేకాక, ఇది మామ మరియు అల్లుడు యొక్క మొదటి కలయిక చిత్రం. దీనితో ఈ రేటింగ్ తక్కువే అని చెప్పవచ్చు. మరోవైపు వెంకటేష్ ప్రస్తుతం నారప్ప, నాగ చైతన్య లవ్ స్టోరీ చిత్రాలలో నటిస్తున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా షూటింగులు ఆగిపోయాయి. నారప్ప తమిళంలో క్లాసిక్ అనిపించుకున్న అసురన్ సినిమా అధికారిక రీమేక్. నారప్ప షూటింగ్ చాలా వరకు పూర్తి అయిపోయింది. వేసవిలోనే విడుదల అవ్వాల్సింది. అయితే కరోనా కారణంగా కుదరలేదు. ఇక ఈ ఏడాదిలో షూటింగ్ మొదలుపెట్టే అవకాశం లేదన్నట్టు సమాచారం.
లవ్ స్టోరీ షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి అయిపోయింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కూడా వేసవిలోనే విడుదల కావాల్సింది. తాజాగా ఈ సినిమా కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.





