‘బ్రహ్మోత్సవం’ టైటిల్ సాంగ్ అదిరిపోయింది!

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న “బ్రహ్మోత్సవం” సినిమా చివరి షెడ్యూల్ ను రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్ లో చిత్రీకరిస్తున్నారు. మే 6 లేదా 13వ తేదీన విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ఆడియోను ఈ నెల 24వ తేదీన తిరుపతిలో అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చారు.

ADVERTISEMENT

అయితే ఈ సినిమా టైటిల్ సాంగ్ విన్న కమెడియన్ ‘వెన్నెల’ కిషోర్ తన అనుభూతిని ట్విట్టర్ వేదికగా వ్యక్తపరిచారు. “బ్రహ్మోత్సవం టైటిల్ సాంగ్ వినే అవకాశం మరియు ఈ పాట చిత్రీకరణ చూశానని, ఇటీవల కాలంలో అత్యద్భుతంగా చిత్రీకరించిన పాట” ఇదంటూ తన సందేశాన్ని వినిపించారు. వాస్తవానికి ఈ సినిమా ఆడియోపై పెద్దగా అంచనాలు లేవు. ఆహ్లాదకరంగా ఉండే మిక్కీ స్వరాలు వినసొంపుగా ఉంటాయి గానీ, కమర్షియల్ ఊపును ఇవ్వలేవు. కానీ, ‘వెన్నెల’ కిషోర్ చేసిన ట్వీట్ ‘బ్రహ్మోత్సవం’ ఆడియోపై అంచనాలు పెట్టుకోవచ్చు అన్న నమ్మకాన్ని ప్రిన్స్ అభిమానులకు కలిగించినట్లయ్యింది.

ADVERTISEMENT
Latest Stories